సమంత సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆ పోస్ట్ డిలీట్..? దాని అర్ధం ఏంటి..?

సమంత సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆ పోస్ట్ డిలీట్..? దాని అర్ధం ఏంటి..?

by Megha Varna

Ads

ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అయిన సమంత, అక్కినేని నాగ చైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇటు అభిమానులు, అటు సినీ తారలు సైతం విడాకులు తీసుకుంటారు అని అస్సలు ఊహించలేదు. మా దారులు వేరు మేము విడిపోతున్నానంటూ కొన్ని రోజుల క్రితం సమంత, నాగ చైతన్య పోస్ట్ చేసారు.

Video Advertisement

అయితే వీళ్ళు విడిపోయారని తెలుసు కానీ దాని వెనుక ఉన్న కారణం అయితే మాత్రం ఇంకా బయటపడ లేదు. తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ నుంచి విడాకులు ప్రకటన పోస్ట్ ని డిలీట్ చేసింది. అయితే ఈమె ఆ పోస్ట్ ని డిలీట్ చేయడం వల్ల మళ్లీ ఈ జంట ఒకటవుతారా అన్న సందేహం కలుగుతోంది. మరి ఈ భామ ఎందుకు పోస్ట్ డిలీట్ చేసింది అనేది ఇప్పటి వరకు అయితే ప్రశ్నార్థకమే.

సమంత మాత్రం ఏ పని చేసినా ఆలోచించి చేస్తుందని.. ఎంతో మెచ్యూర్డ్‌గా ఆమె ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ పోస్ట్ ని డిలీట్ చేయడం వెనుక కూడా ఏదో బలమైన కారణం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అలాంటిదేమీ లేదు అని సమాచారం. సమంత తన సోషల్ మీడియాలో ఉన్న కొన్ని పోస్ట్‌లని డిలీట్ చేద్దామని అనుకున్నారు అని, ఈ క్రమంలోనే ఆ పోస్ట్ కూడా డిలీట్ చేశారు అని, ఇంక నాగ చైతన్య, సమంత మళ్లీ కలిసే అవకాశం లేదు అని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాలో సమంత చేసిన ”ఊ అంటావా” ఐటెం సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా వినపడుతోంది. ఈ మధ్య కాలంలో ఏ ఐటమ్ సాంగ్ కి రానన్ని వ్యూస్ ఈ సాంగ్ కి వచ్చాయి. అలానే బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌ సమంతకి మూడు సినిమాల ప్రాజెక్ట్ ఆఫర్ ఇచ్చారని సమాచారం.


End of Article

You may also like