Bigg Boss Telugu-5 : షన్ను “బిగ్‌బాస్ టైటిల్” గెలవకపోవడానికి వెనకాల ఇంత కథ ఉందా..? ఫైర్ అవుతున్న నెటిజన్స్..!

Bigg Boss Telugu-5 : షన్ను “బిగ్‌బాస్ టైటిల్” గెలవకపోవడానికి వెనకాల ఇంత కథ ఉందా..? ఫైర్ అవుతున్న నెటిజన్స్..!

by Megha Varna

Ads

మొదటి నాలుగు బిగ్ బాస్ సీజన్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా అలరించడం వలన ఈ సీజన్ పై కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ సీజన్లో కూడా కంటెస్టెంట్లు తెగ సందడి చేశారు. 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా టైటిల్ ఫేవరెట్ గా షణ్ముఖ్ జస్వంత్ పేరు వినిపించింది. అయితే టైటిల్ మాత్రం సన్నీ గెలుచుకున్నాడు.

Video Advertisement

దీనిపై సోషల్ మీడియాలో పలు అనుమానాలు వస్తున్నాయి. భారీగా ఓట్లు షణ్ముఖ్ జశ్వంత్ కి వచ్చినా సరే అతడిని ఓడించారని షన్ను ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. కుట్రపూరితంగా షన్నుని గెలిపించలేదనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. షన్ను ఫ్యాన్స్ బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా ఫైర్ అవుతున్నారు. కావాలనే సన్నీని గెలిపించారు అంటూ ఆరోపిస్తున్నారు.

పైగా ఈ షో స్క్రిప్ట్ ఆధారంగా నడుస్తోందని పోస్టులు చేస్తున్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు మాత్రం సన్నీకి ఓట్లు ఎక్కువ వచ్చాయనిఅందుకే విజేతగా ప్రకటించారు అని చెప్తున్నారు. అయితే షణ్ముఖ్ కి వ్యతిరేకంగా ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అంతా కలిపి అతనికి ఓటింగ్ రాకుండా కుట్ర పన్నారని అనుమానం కూడా కలుగుతోంది. ఏదిఏమైనప్పటికీ రన్నర్ గా షన్ను సరిపెట్టుకోవాల్సి వస్తోంది.


End of Article

You may also like