ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినకూడదు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినకూడదు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

by Megha Varna

Ads

పెద్దవాళ్లు ఉసిరికాయని రాత్రి పూట మరియు ఆదివారం రోజుల్లో తినకూడదు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎందుకు పెద్ద వాళ్ళు అలా చెబుతున్నారు దీని వెనక ఉండే కారణం ఏమిటి అని ఆలోచించారా…? అయితే మరి దానికి సమాధానం ఇక్కడ ఉంది. దానిని చూసేయండి. పూర్వం రోజుల్లో రాత్రిపూట ఉసిరికాయ అడిగితే తినకూడదు అని చెప్పేవారు.

Video Advertisement

అలాగే పెద్దలు ఉసిరికాయ పదం కూడా పలకకూడదని కూడా చెప్తూ ఉండేవారు. ఇప్పటికి కూడా చాలా మంది ఇళ్లల్లో ఈ పద్ధతి నడుస్తోంది. అయితే ఇప్పుడు వాళ్ళకి తెలియక పోయినా సరే పెద్దవాళ్ళు అప్పుడు అలా చెప్పారని అలానే చెప్పేస్తున్నారు. అలానే పాటిస్తున్నారు. అయితే మరి ఆ నియమం వెనక ఉండే అర్థం గురించి ఇప్పుడు చూద్దాం.

ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే ఇది పేగుల్లో ఉండే ఆమ్లంని పెంచుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే రాత్రి తిన్న అన్నం సరిగా జీర్ణం అవ్వదు. దీనితో డైజేషన్ లో సమస్యలు కలుగుతాయి. అలానే గుండె మంటగా ఉంటుంది.

అంతే కాకుండా ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఆరోగ్యరీత్యని దృష్టిలో పెట్టుకుని పెద్ద వాళ్ళు ఈ నియమాన్ని పెట్టారు. అందుకనే రాత్రి పూట ఉసిరికాయ తినకూడదు. ఒకవేళ తింటే ఈ ఇబ్బందులు తప్పవు. అందుకే రాత్రి పూట ఉసిరికాయ తినకపోవడమే మంచిది. ఒకవేళ మీరు రాత్రి పూట ఉసిరితో చేసిన పచ్చడిని కానీ ఉసిరిని కానీ తింటుంటే ఆ తప్పు చెయ్యకండి.


End of Article

You may also like