Ads
ఎగ్జామ్ హాల్ లో సీరియస్ గా మీరు పరీక్ష రాస్తున్నప్పుడు, సడన్ గా ఎక్కడనుండో పాట వస్తూ ఉంటుంది. బయటనుంచి ఏమో అని చూస్తే బయటనుంచి కాదు. హాల్లో ఎవరైనా పాట పెట్టారేమో అని చూస్తే, అందరూ దించిన తల ఎత్తకుండా రాస్తూ ఉంటారు. మరి పాట ఎక్కడ నుండి వస్తుంది అబ్బా? ఇంక ఎక్కడి నుండి. మనలో నుండే.
Video Advertisement
రేసుగుర్రం సినిమాలో హీరోయిన్ పైకి కనిపించకుండా నవ్వడం, భయపడటం చేస్తుంది కదా. మనం కూడా అలాగే నోరు కదిలించకుండా పాటలు పాడుతూ ఉంటాం, కొంతమంది అయితే లోపల మైకేల్ జాక్సన్, ప్రభుదేవా రేంజ్ లో డాన్సులు కూడా వేస్తారు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఏంటబ్బా అసలు ఈ పాట మనకి ఎందుకు వస్తోంది అని. దానికి మెదడుకు సంబంధించిన ఒక కారణం ఉందట.
అలా మన మైండ్లో పాట వినిపిస్తుంటే దాన్ని బ్రెయిన్ ఇచ్ అంటారట. అంటే అదేదో వ్యాధి కాదు. భయపడకండి. మనం ఎప్పుడైనా పాట వింటే అది మన బ్రెయిన్ లో ఉన్న ఆడిటరీ కార్టెక్స్ (అంటే వినడం, ఇంకా భాషలు అర్థం చేసుకోవడం చేసే మెదడులో ఒక భాగం) అనేది ప్రభావితం అవుతుందట. ఒకవేళ మీకు ఏదైనా పాట రోజు మొత్తం అలానే వినిపిస్తుంటే మీరు మళ్లీ మళ్లీ మెదడులో నుండి ఆ వచ్చే పాటని వినడం తప్ప ఏమీ చేయలేరు.
ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ అలా పాట వినిపించినా కూడా మొత్తం పాట ప్లే అవ్వదు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ మెదడులో ఒక పాట అది కూడా ఆ పాటలో ఒక భాగం మాత్రమే మళ్లీ మళ్లీ ప్లే అవుతుంది. మొత్తం పాట ఎప్పుడు ప్లే అవ్వదు. దీన్ని ఇయర్ వార్మ్ అంటారు.
ఇక్కడ ఇయర్ అంటే ear అంటే చెవి. వార్మ్ అంటే worm అంటే పురుగు. ఇది విన్న తర్వాత చెవుల్లోకి పురుగు దూరితే ఇలా అవుతుందా? అనే అనుమానం మీలో కొంతమందికైనా వచ్చే ఉంటుంది. అంటే మామూలు పురుగు దూరితే చెవిలో దురద పుడుతుంది. చెవిలో నీళ్లు పోస్తే బయటికి వచ్చేస్తుంది. కానీ పాట అనే పురుగు దూరితే మాత్రం మెదడులో దురద పుడుతుంది. అందుకే బ్రెయిన్ ఇచ్ అనే పేరు వచ్చిందేమో.
ఇంకొకటి ఏంటి అంటే మీరు ఒకవేళ ఆ పాటకు సంబంధించిన ఏదైనా పోస్టర్ చూసినా, లేదా ఆ పాట ప్లే చేద్దామని అని అనుకున్న వెంటనే పాట ప్లే అవ్వకముందే మీరు పాడడం మొదలు పెడతారు. ఇక్కడ కూడా పాట మొత్తం కాదు. కేవలం కొన్ని లైన్లు మాత్రమే. దీన్నే మ్యూజికల్ ఇమేజరీ అని అంటారు.
ఇలా మెదడులో వచ్చే పాటని ఆపడానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే బ్రెయిన్ ని బిజీగా ఉంచడం. మామూలుగా మనం ఏదైనా బోరింగ్ పని చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వదు. అప్పుడే ఆలోచనలు ఎటో వెళ్లిపోయి బ్రెయిన్ పాట పాడడం మొదలు పెడుతుంది.
కాబట్టి బ్రెయిన్ ఇన్వాల్వ్ అయి ఉంటే పాట ఆగిపోతుంది. అంటే పరీక్ష రాయడం అంత బోరింగ్ గా ఉంటుంది ఏమో? అందుకే పాటలు వినిపిస్తాయి ఏమో? ఇప్పుడు కూడా మీకు ఏదైనా పాట వినిపిస్తుందేమో ఒకసారి పరీక్షించి చూసుకోండి.
End of Article