Home Filmy Adda “అసలు ఏమైంది సుధీర్ అన్నా.?” అంటున్న ఫ్యాన్స్.! ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి..?

“అసలు ఏమైంది సుధీర్ అన్నా.?” అంటున్న ఫ్యాన్స్.! ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి..?

by Mohana Priya

సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఈ పేరు చెబితేనే అభిమానులు ఊగిపోతున్నారు, తెరపై అయన కనబడితే ఈలలు, కేకలు వినబడుతున్నాయి. జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన సుధీర్…స్టేజ్ ఆర్టిస్ట్ గానే కాదు పండుగలకి జరిగే ఈవెంట్లకి, డాన్స్ షోలలో కూడా తన పెర్ఫార్మన్స్ ని ఇస్తూ అలరిస్తున్నాడు.

బిజీ బిజీ షెడ్యూల్స్ తో తన టైం టేబుల్ ని ఫిక్స్ చేసుకున్నాడు. అంతేకాదు యుట్యూబ్ లో సుధీర్ కోసం మరియు అయన కామెడీ,కోసం ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తుంటారు. అంతే కాదు షోలలో కూడా సుధీర్ కోసం కేకలు వేస్తున్నారని యాంకర్ సుమ, రష్మీ, అనసూయ, ఇంద్రజ వంటి వారు ఎప్పుడు చెబుతూనే ఉంటారు.

sudigaali sudheer to quit jabardasth

మరికొందరైతే కర్ణాటక అభిమానులం మేము సుధీర్ కోసం ఈ వీడియో చూసి కామెంట్ చేస్తున్నాం అంటూ చెప్పారు కూడా.. గత కొన్ని సీజన్ల నుండి ఢీ ప్రోగ్రాంలో సుధీర్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఢీ హిట్ అవ్వడానికి సుధీర్ ఒక ముఖ్య కారణం. ఇలా ఉండగా, ఈ సీజన్లో మాత్రం సుధీర్ కనిపించడంలేదు. దాంతో, “అసలు షో కి మెయిన్ హైలైట్ అయిన సుధీర్ షోలో కనిపించకపోవడం ఏంటి?” అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

comments on sudigali sudheer in tv shows

కొంతమందేమో, “సుధీర్ కి కుదరక షో నుండి తనే తప్పుకున్నారు” అని అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో, “బడ్జెట్ కంట్రోల్ చేయడం కోసం మల్లెమాల వాళ్ళు సుధీర్ ని తొలగించారు” అని అంటున్నారు. ఈ విషయంపై షో యాజమాన్యం కానీ, లేదా సుధీర్ కానీ నోరు విప్పడం లేదు. దాంతో అభిమానులు అందరూ అసలు జరిగింది ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ మల్లెమాల యాజమాన్యం సుధీర్ ని తొలగిస్తే ఫాన్స్ రియాక్షన్ మామూలుగా ఉండదేమో. ప్రస్తుతం అయితే సుధీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతున్నారు.

You may also like