అయోధ్య రామ మందిరం చూసి దేశమంతా గర్విస్తుంటే…కొంతమంది తమిళ్ వాళ్ళు ఈర్షతో ఇలా చేస్తున్నారేంటి.?

అయోధ్య రామ మందిరం చూసి దేశమంతా గర్విస్తుంటే…కొంతమంది తమిళ్ వాళ్ళు ఈర్షతో ఇలా చేస్తున్నారేంటి.?

by Mohana Priya

Ads

అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. రామనామ స్మరణతో అయోధ్య అంతా మారుమ్రోగుతోంది. రామ మందిరం అంతా పూల వర్షం కురిసింది.

Video Advertisement

నరేంద్ర మోడీ శ్రీరాముడికి పూజలు చేశారు. ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్రీరాముని ప్రతిమని రూపొందించారు. భారతదేశం అంతా కూడా జైశ్రీరామ్ అంటూ ఈ వేడుకని జరుపుకుంటుంది. ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో దశాబ్దాల కల ఇప్పుడు నెరవేరింది అని ఆనందపడుతున్నారు. అయితే ఒకపక్క ఇంత జరుగుతుంటే, మరొక పక్క మరొక రకమైన విషయం చర్చనీయాంశం అయ్యింది. తమిళనాడు వాళ్లు మాత్రం ఈ వేడుకలో పాల్గొనట్లేదు అంటూ ఒక విషయం వార్తల్లో నిలిచింది. ట్విట్టర్ లో రావణుడికి మద్దతుగా ట్రెండ్ నడిచింది. ల్యాండ్ ఆఫ్ రావణ, తమిళ్ ప్రైడ్ రావణ అంటూ ఈ ట్రెండ్ ట్విట్టర్ లో నడుస్తోంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

తమిళనాడుకు చెందినవారు రావణుడికి మద్దతు ఇస్తారు. రావణుడిని దైవంగా భావిస్తారు. ఇలా చేయడం వెనుక పలు రకాల కథనాలు ఉన్నాయి. అందులో ఒక కథనం ఏంటి అంటే, రావణ ద గ్రేట్ కింగ్ ఆఫ్ లంక అనే పుస్తకంలో ప్రొఫెసర్ పూర్ణ లింగం పిళ్ళై, రావణుడు ద్రవిడ వంశానికి చెందినవారు అని, అందులోనూ ముఖ్యంగా ఆయన తమిళులు అని పేర్కొన్నారు. ఈ భావం చేత రావణుడిని తమిళనాడుకు చెందినవారు సమర్థిస్తారు అని అంటారు. ఈ విషయంపై ఉన్న మరొక కథనం ఏంటి అంటే తమిళంలో రామాయణాన్ని కంబరామాయణ పేరుతో రాశారు.

ఇందులో రాసిన దాని ప్రకారం, రావణాసురుడు చాలా మంచి రాజు. ఆయన ప్రజలని ఎంతో బాగా చూసుకున్నారు. అలాగే మంచి సంగీత విద్వాంసుడు కూడా. సాక్షాత్తు ఆ పరమశివుడే రావణాసురుడి సంగీతాన్ని మెచ్చారు. ఆయన కొన్ని పొరపాట్లు చేశారు. సీత విషయంలో ఆయన చేసినది సరైన విషయం కాదు. అయితే దీనికి మరొక కోణం కూడా ఉంది అని అంటారు. తన చెల్లెలిని బాధపెట్టారు. కాబట్టి తన సోదరిని బాధ పెట్టిన ఆవేదన కూడా రావణుడికి ఉంది. కానీ మరొక పక్క ఆయన చాలా గొప్ప పరిపాలకుడు. తన ఊరిలో డబ్బుల్లేక ఇబ్బందులు ఎదుర్కొన్న పేదవారికి బంగారు పాత్రలు ఉపయోగించే అంత సౌభాగ్యం

the actors who played ravana role..!!

తన రాజ్యం అంతా సంపదలతో, సుఖ సంతోషాలతో నిండిపోయే అంత గొప్పగా పాలించారు. అంతే కాకుండా రావణుడిని సంహరించిన తర్వాత ఒక సందర్భంలో లక్ష్మణుడికి, రాముడు రాజకీయాల గురించి, ఒక రాజు తన రాజ్యంలో ఎలా పాలించాలి అనే విషయం గురించి రావణుడిని చూసి నేర్చుకోమని చెప్తారు అని కూడా అంటారు. స్వచ్ఛమైన పాలని ఒక చిన్న విషం విషయం చుక్క కూడా పాడు చేయగలదు. అదేవిధంగా సీత విషయంలో జరిగిన దాని వల్ల రావణాసురుడు మీద అందరికీ మరొక రకమైన అభిప్రాయం ఏర్పడింది కానీ, రావణాసురుడు చాలా గొప్ప రాజు అని అంటారు.

ravana

ఈ కారణంగానే చాలా మంది తమిళులు రావణాసురుడిని ఆరాధిస్తారు. అయితే మరొక పక్క, అందరూ రావణాసురుడిని ఆరాధించరు. అందులోనూ ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వాళ్లు అందరూ కూడా రావణుడిని ఏమీ అభిమానించరు. ఇది కేవలం రాజకీయాల వచ్చిన ఒక అపోహ మాత్రమే అనే మరొక కథ కూడా ఉంది. ఇలా ఈ విషయం మీద ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం సోషల్ మీడియాలో రావణాసురుడికి తమిళ వాళ్ళు మద్దతు పలుకుతూ ఒక ట్రెండ్ అయితే నడుస్తోంది.

ALSO READ : ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం లేదు.. వైరల్ అవుతున్న నయనతార క్షమాపణ లేఖ!


End of Article

You may also like