అంత ట్రోల్ చేస్తున్నారు..! కానీ అసలు విషయం ఏంటో తెలుసా..?

అంత ట్రోల్ చేస్తున్నారు..! కానీ అసలు విషయం ఏంటో తెలుసా..?

by kavitha

Ads

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎనర్జీకి మారుపేరుగా ఉండేవారు. డ్యాన్స్, ఫైట్లలో అతని హుషారే వేరు. సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం వంటి సినిమాలలో సాయి ధరమ్ తేజ్ వేసిన డ్యాన్స్, స్టైల్‌కు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులందరు ఫిదా అయ్యారు.

Video Advertisement

సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. ఈ మూవీ జులై 28న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతున్న సమయంలో అతని మాట తడబడింది. దాంతో నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. Sai-Dharam-Tejతాజాగా జరిగిన ‘బ్రో’ ప్రి రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ ప్రసంగిస్తూ ఫ్యాన్స్ కు థ్యాంక్ యు చెప్పబోతుండగా, సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇది చూసిన కొందరు తేజ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మందు కొట్టి వచ్చడేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సాయిధరమ్ తేజ్ మాట్లాడే విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకుముందులా అతను క్లారిటీగా, గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం సాయిధరమ్ తేజ్ రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. కోమలోకి వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని నెలల పాటు హాస్పటల్ లో ఉన్నాడు. తర్వాత ఇంటికి వచ్చినా కొన్ని నెలల పాటు బయటికి రాలేదు. ఆ తర్వాత కోలుకుని చిత్రాలు చేస్తున్నప్పటికీ తేజులో మునపటి జోష్ లేదు.
స్వయంగా సాయిధరమ్ తేజ్ మునపటిలా, పూర్తి ఆరోగ్యంతో లేనని పలు ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పాడు. ఆ విషయం తెలిసినప్పటికి కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు సాయిధరమ్ తేజ్ సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీస్ ఫర్ యూ అనే ఇన్ స్టా పేజీలో ఒక క్లిపింగ్ షేర్ చేసి, ‘అన్నకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి సరిగ్గా మాట్లాడలేక పోతున్నాడు. దాన్ని పట్టుకుని తాగేసివచ్చాడు అని అంటారెంటిరా?’ అని రాసుకొచ్చారు.

watch video :

https://www.instagram.com/reel/CvIVvukJs8D/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: హీరో నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు..! ఎందుకంటే..?


End of Article

You may also like