ఐఫోన్ వెనక ఫ్లాష్ కు కెమెరాకు మధ్య ఆ చిన్న రంద్రం ఎందుకు ఉంటుందో తెలుసా?

ఐఫోన్ వెనక ఫ్లాష్ కు కెమెరాకు మధ్య ఆ చిన్న రంద్రం ఎందుకు ఉంటుందో తెలుసా?

by Mohana Priya

మనిషికి తిండి నిద్ర లేకపోయినా బతకగలడు ఏమో గాని ఫోన్ లేకపోతే మాత్రం ఒక్క రోజు గడవడం కూడా కష్టం. అంతగా మనం ఫోన్ లకి అలవాటు పడిపోయాం కాదు కాదు ఒక రకంగా చెప్పాలంటే బానిసలు అయిపోయాం. చిన్న వివరం నుండి పెద్ద సమాచారం వరకు అన్ని ఫోన్ లోనే ఉంటాయి.

Video Advertisement

ఒకసారి మీరు మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ లు అన్నీ చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. ఒక 10, 20 కంటే ఎక్కువ చెప్పలేరు. మనం ఫోన్ లో ఉన్న అన్ని ఫీచర్స్ గమనిస్తాం కానీ ఫోన్ పైన ఉన్న కొన్నిటిని అంతగా పట్టించుకోము.

ఫోన్ పైన ఉన్నవి అంటే కెమెరా, ఫ్లాష్ లైట్, చార్జింగ్ ఎటు ఉంది వంటి విషయాలు కాదు. సరిగ్గా చూడండి. మీ ఫోన్ మీద పైన వైపు కాని పక్క వైపు గాని లేదా కింద వైపు గాని ఒక చిన్న రంధ్రం వుంటుంది. అది ఎందుకో మీకు తెలుసా? ఫోన్ ఎక్కువ సేపు వాడితే ఫోన్ లో ఉన్న పార్ట్స్ వేడెక్కుతాయి. ఆ వేడి ఆ రంధ్రంలో నుండి బయటకు వెళ్తుంది.

ఈ జవాబు మీలో కనీసం ఒక్కరికైనా తట్టి ఉండొచ్చు. కానీ సమాధానం ఇది కాదు.అప్పుడప్పుడు మనిషి మెదడులోకి ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఏదో ఒక సమాధానం వస్తుంది కదా. ఈ ప్రశ్నకు ఉదాహరణ సమాధానంగా దీని తీసుకున్నాం. అసలు జవాబు ఏమిటంటే.

నిజానికి అది రంధ్రం కాదు. అక్కడ ఒక మైక్ ఉంటుంది. అంటే దానిలో నుండి మనకి ఏ శబ్దాలు బయటకు వినిపించవు అలాగే ఆ మైక్ ద్వారా ఏమీ రికార్డ్ చేయలేం. ఆ మైక్ ని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు. మనం బయటికి వెళ్లినప్పుడు ఎప్పుడైనా మనకి ఫోన్ వస్తే, ఒకవేళ మన చుట్టూ శబ్దం ఎక్కువగా ఉంటే అవతల వాళ్ళకి మనం మాట్లాడేది వినిపించకపోవచ్చు.

అప్పుడు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మన చుట్టూ ఉండే శబ్దాలని తగ్గించి కేవలం మన మాటలు మాత్రమే అవతల వ్యక్తికి వినపడేలా చేస్తుంది. చాలా ఫోన్లలో ఈ మైక్ ఉంటుంది. ప్రత్యేకించి ఐఫోన్లో అయితే ఈ మైక్ ద్వారా కాల్ రికార్డింగ్ అనేది ఇంకా స్పష్టంగా ఉంటుందట. ఇంకెందుకు ఆలస్యం. ఒకసారి మీ ఫోన్ మీద కూడా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉందా లేదో, అది ఎటు వైపు ఉందో చూసేయండి.


You may also like