అసలు ఎవరీ విజయా గద్దె? ట్విట్టర్ సొంతం కాగానే ఎలాన్ మస్క్ ఆమెనే ఎందుకు టార్గెట్ చేసారంటే?

అసలు ఎవరీ విజయా గద్దె? ట్విట్టర్ సొంతం కాగానే ఎలాన్ మస్క్ ఆమెనే ఎందుకు టార్గెట్ చేసారంటే?

by Megha Varna

Ads

మైక్రో బ్లాగర్ ట్విటర్ ను సొంతం చేసుకున్న తరువాత రోజు నుండే ఎలాన్ మస్క్ సంస్థ పని తీరు పై దృష్టి పెట్టడం ప్రారంభించారు. అయితే దానిలో ముఖ్యంగా కంపెనీ లీగల్ చీఫ్ అయినటు వంటి ఈ తెలుగు అమ్మాయి ని టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఇంతకీ ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు..?

Video Advertisement

తెలుగు మహిళ అయినటు వంటి విజయ గద్దెను టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ట్విట్టర్ లో కీలకమైన లీగల్  హెడ్ గా పని చేస్తున్నారు విజయ.

అయితే నిజానికి ట్విటర్ సీఈఓ కంటే లీగల్ హెడ్ పదవి చాలా ముఖ్యమైనది. లీగల్ హెడ్ అన్ని బాధ్యతలు తీసుకుంటారు. ట్విట్టర్ యూజర్స్ వాడే పదాలు అభ్యంతరకరంగా లేకుండా చూడాలి. అయితే ఆమె నిజానికి ఈ పదవికి న్యాయం చేశారనే చెప్పాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ని తొలగించేందుకు ఈమె ముఖ్యమైన పాత్ర పోషించారు.

టాప్ లాయర్ అయిన విజయ ట్విట్టర్ లోనూ ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ అమెరికా లోని సంప్రదాయవాదులు కి ఇవి ఇబ్బందికరంగా మారాయి. ఇతరులకు ఇబ్బంది పెట్టే పదాలను ఈమె తొలగిస్తూ ఉంటారు. అయితే ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తున్నారు అని చర్చ బోర్డు మీటింగ్ లో వస్తున్నప్పుడే విజయ ఎమోషనల్ అయ్యారు.

మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్తే సంస్థ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆమె భయ పడ్డారు. ఇప్పటి వరకు కంటెంట్ పైన ఆమె పడిన కష్టం పోతుందని అనుకున్నారు. విజయ గద్దె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఈమెకు మూడేళ్లు వున్నప్పుడు అమెరికా కి వెళ్లి పోయారు. విజయ తల్లిదండ్రులు అక్కడే స్థిర పడ్డారు. విజయ లా చదివారు. రామ్సే హామ్సనీని ఈమె పెళ్లి చేసుకున్నారు. అతను కూడా లాయర్.

 


End of Article

You may also like