కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయంపై ఫాన్స్ ఫైర్..! ప్రతిసారి ఇలాగే చేస్తున్నారంటూ?

కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయంపై ఫాన్స్ ఫైర్..! ప్రతిసారి ఇలాగే చేస్తున్నారంటూ?

by Megha Varna

Ads

వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత టీం కు బ్రేక్ పడింది. వరుసగా ఐదు టీ20లు ఓడిపోయామన్న కసితో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు తొలి వన్డేలో చెలరేగిపోయారు. కొండంత లక్ష్యం ముందున్నా ఏమాత్రం కలవరపడకుండా కుమ్మేశారు. 348 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించారు.

Video Advertisement

అయితే ఈ మ్యాచ్ టీం సెలక్షన్ విషయంలో కోహ్లీ పై ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. దానికి కారణం మనీష్ పాండే స్థానంలో కేదార్ జాదవ్ ను తీసుకోవడమే. ప్ర‌తీసారి కార‌ణం లేకుండా పాండేను తుదిజ‌ట్టు నుంచి తొలిగిస్తున్నార‌ని ఒక నెటిజ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. కుర్రాళ్ళయిన మనీష్ పండేయ్, శివమ్ దూబే లను తప్పించి 34 ఏళ్ల కేదార్ జాదవ్ ను ఆడించడం ఏంటి అంటున్నారు.

వాస్తవానికి టీ20 సిరీస్‌లో మ‌నీశ్ పాండే చ‌క్క‌గా రాణించాడు. ఈ సిరీస్ మొత్తంలో నాటౌట్‌గా నిలిచి ఆక‌ట్టుకున్నాడు. ఐదో టీ20లో జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న ద‌శ‌లో అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. ఇంత మంచి ఫార్మ్ లో ఉన్న అతన్ని కుర్చోపెట్టడం ఏంటి? మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో కేదార్ చక్కగా ప్రదర్శించాడు. 15 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0తో కివీస్ ఆధిక్యంలో ఉంది. రెండో వ‌న్డే
శ‌నివారం ఆక్లాండ్‌లో జ‌రుగుతుంది.


End of Article

You may also like