Ads
సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గొడవ ఎందుకు వచ్చిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని అలీగడ్ కి చెందిన ఒక ఇమామ్ గడ్డం తన భార్యకి నచ్చలేదని ఆరోపించారు. అయితే మత భావాలకి లోబడి గడ్డాన్ని ఆయన తీయలేదని తెలుస్తోంది.
Video Advertisement
దీనితో తన భార్య అతనిపై లేనిపోని కేసులు పెట్టడం మొదలు పెట్టింది. ఆమె భర్త తనని త్రిపుల్ తలాక్ కోరాడని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు కూడా ఆమె పెట్టింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం చూసినట్లయితే జలాలుద్దీన్ కి ఏడాది క్రితం వీణతో పెళ్లి జరిగింది. తనతో పెళ్లయినప్పటి నుండి ఆమెకి గడ్డం నచ్చలేదు.
దీంతో గడ్డం తొలగించమని గొడవ చేసేది. గడ్డం తీయకపోతే వివాహ బంధాన్ని కూడా ముక్కలు చేసుకుందాం అంటూ ఆమె చెప్పేది. ఆమె ఆధునిక భావాలు కలిగి ఉంది కాబట్టి గడ్డాన్ని తొలగించమని తొలగించమని చెబుతోంది అని జలాలుద్దీన్ అన్నారు. ఇది మతపరమైనదని ఆమెకు ఎంత చెప్పినా ఆమె వినడం లేదని చెప్పారు. పైగా వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టిందని.. పోలీసులు ఆయన మాట వినడం లేదని అన్నారు.
End of Article