భార్య ఆనందం కోసం ఎవరూ చేయని పని చేశాడు..! ఈ సంఘటన చూస్తే కన్నీళ్లు ఆగవు..!

భార్య ఆనందం కోసం ఎవరూ చేయని పని చేశాడు..! ఈ సంఘటన చూస్తే కన్నీళ్లు ఆగవు..!

by kavitha

Ads

శ్రీకాంత్ హీరోగా నటించిన కన్యాదానం సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో శ్రీకాంత్ తన భార్య రచనను ఆమె లవర్ ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. అచ్చం అలాంటి కథ నిజ జీవితంలో రిపీట్ అయ్యింది. ఒక యువకుడు  ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

Video Advertisement

కానీ ఆమె అంతకు ముందే మరో వ్యక్తిని ప్రేమించింది. కానీ ఆ విషయం భర్త దగ్గర దాచి పెట్టింది. ఆ అమ్మాయి భర్త లేని టైంలో ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. అది గమనించిన స్థానికులు ఇద్దరినీ కట్టేసి కొట్టారు. ఈ విషయం తెలిసి వెళ్లిన భర్త తన భార్యకు ఆమె ప్రియుడికి పెళ్లి జరిపించాడు. ఈ సంఘటన చూసిన వారంతా అవాక్కయ్యారు. మరి ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం.. kanyadanam-movie-repeat-in-biharబిహార్‌ రాష్ట్రంలోని నవాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవాడలో ఒక గ్రామానికి చెందిన యువకుడికి పెళ్లి జరిగింది. కానీ అతని భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో పనిమీద ఒక రోజు  బయటకు వెళ్లిన భర్త రాత్రికి ఇంటికి రాలేదు. దాంతో ఆ భార్య ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్లింది.ఆమె వెళ్ళడం చూసిన స్థానికులు మరియు ప్రియుడి బంధువులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, చెట్టుకు కట్టేసికొట్టారు. తరువాతి రోజు ఊరిలోని గ్రామ పెద్దలందరు కలిసి పంచాయతీ పెట్టి, వారిద్దరినీ ఆ గ్రామం నుంచి బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ విషయం తెలిసి తిరిగి వచ్చిన ఆ యువతి భర్త, భార్యను ఏమి అనకుండా, కోపం తెచ్చుకోకుండా భార్యను, ఆమె ప్రియుడిని గుడికి తీసుకువెళ్లాడు.
ఆ తరువాత వారిద్దరికీ దండలు మార్పించి, వివాహం జరిపించాడు. ఈ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్య పోయారు. కొంత మంది అయితే ఆ భర్త అలా చేసినందుకు అతడిని తిట్టారు. ఇక ఈ సంఘటనకు  సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Also Read: ప్రపంచంలో రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా..? ఎంత సంపాదించాడు అంటే..?


End of Article

You may also like