Ads
తరచూ స్నేహితుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఒక కానిస్టేబుల్ బయటకు వెళ్తుండే వాడు. ఎప్పటి లాగే తన స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. ఆ తరవాత వెళ్ళాడు. అయితే భార్య కి భర్త పై అనుమానం కలిగింది.
Video Advertisement
ఎప్పుడూ కూడా స్నేహితుల్ని ఎందుకు కలవడానికి వెళ్తున్నారు అని ఆమె ఎప్పటిలాగే బయటికి వెళ్ళిన తన భర్తని ఫాలో అయ్యింది. ఆఖరికి బుద్ధి చెప్పింది.
ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని భరత్ పూర్ కి చెందిన సురేంద్ర కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అయితే సురేంద్రకి మరొక ఆమె తో సంబంధముంది. చాలా కాలం నుండి సురేంద్ర ఒక మహిళ తో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. తరచుగా భార్యకు తెలియకుండా ఆమెను కలిసి వస్తున్నాడు.
భార్య కి స్నేహితుల ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ప్రియురాలు వద్దకు వెళ్లి కాసేపు సమయం గడిపి వస్తూండే వాడు సురేంద్ర. గత నెల లో అయితే ఏకంగా ఐదు నెలల టూర్ అని చెప్పి వెళ్లాడు సురేంద్ర. ఇంకేముంది భార్య కి అతని పై అనుమానం కలిగింది. ఎప్పట్లాగే బయటకు వెళ్లాడు సురేంద్ర.
భార్య భర్తకు తెలియకుండా స్కూటీ పై రహస్యంగా ఫాలో అయ్యింది. భర్త ఒక ఆమెని తన కారు లో ఎక్కించుకోవడం చూసింది. కారుని రోడ్డు మీద ఆపేసి ఇద్దరిని చెప్పు తో కొట్టింది. 30 నిమిషాల పాటు సురేంద్ర భార్య సురేంద్ర పై, అతని ప్రియురాలి పై దాడి చేసింది. అడ్డుకోవడానికి అక్కడ ఉన్న వాళ్లు ప్రయత్నించినా ఆమె ఎవరి మాట లెక్క చేయలేదు. ఆఖరికి కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.
End of Article