సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. సమయం కథనం ప్రకారం రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్రాంతానికి చెందిన ప్రభుదాస్ రమ్య అనే దంపతులకి 2 ఏళ్ల ప్రకాష్ అనే కుమారుడు ఉన్నాడు.  వీరు ముగ్గురు కలిసి హైదరాబాద్ లోని వారి బంధువుల ఇంటికి వచ్చారు.

representative image

తిరిగి జోధ్ పూర్ వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళారు అక్కడ రైలు బయలుదేరడానికి ముందు వాటర్ బాటిల్ కోసం అంటూ రమ్య తన కొడుకు ప్రకాష్ తో కలిసి రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చారు. ఎంత సేపైనా సరే భార్య కొడుకు తిరిగి రాకపోవడంతో ఏమైందో అని అనుమానం వచ్చి భర్త ప్రభుదాస్ రమ్య ప్రకాష్ కోసం వెతకడం మొదలు పెట్టారు.

wife runs away with another man at secunderabad railway station

చుట్టుపక్కల వారిని కూడా అడిగారు. ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది అని స్థానికులు చెప్పారు. దాంతో అనుమానం వచ్చి అధికారులు సంప్రదించగా వారు అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ని చూపించారు. అందులో రమ్య తన కొడుకు ప్రకాష్ తో కలిసి ప్రకాష్  ఒక యువకుడి బైక్ పై వెళ్ళడం కనిపించింది. దీంతో ప్రభుదాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వెళ్లిపోయిన రమ్య కోసం పోలీసులు వెతుకుతున్నారు.