తెలంగాణాలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్!

తెలంగాణాలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్!

by Sainath Gopi

Ads

లాక్ డౌన్ 4 సడలింపులతో దేశంలో పలు రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలైన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైన్ షాప్ ఓపెన్ చేయాలి రూల్ పెట్టారు. ఇప్పుడు లాక్ డౌన్ 5 సడలింపులలో కర్ఫ్యూ సమయాన్నిరాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మార్చిన సంగతి తెలిసిందే. గతంలో రాత్రి 7 గంటల నుండి కర్ఫ్యూ ఉండటంతో సాయంత్రం 6 గంటలకే మద్యం షాపులు బంద్ చేసేవారు. కానీ ఇప్పుడు రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచవచ్చు అని ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు అని స్పష్టం చేసారు.

Video Advertisement

ఈ వార్తతో మందుబాబులు మరింత సంబరపడుతున్నారు అనుకుంట. షాపులు తెరుచుకున్న మొదటి రోజు మందు బాబులు ఎంత హంగామా చేసారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంట. కేవలం ఒక్క రోజే కొన్ని కోట్ల ఆదాయం వచ్చింది మద్యం అమ్మకాల వల్ల. ఎండను కూడా లెక్కచేయకుండా ఒక్కసారిగా మద్యం కోసం లైన్ లో నించున్నారు మందుబాబులు. నియంత్రించేందుకు మద్యం ధరలను కూడా పెంచారు. కానీ ధరలు పెరిగినా మందు బాబులు మాత్రం అస్సలు వెనకడుగు వేయలేదు.

లాక్ డౌన్ కారణంగా మందుబాబులు 45 రోజులు లిక్కర్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత లాక్ డౌన్ ఇంకెన్ని రోజులు ఉంటుందో అనే ఆలోచనతో మందుకు కొరత లేకుండా కొని పెట్టుకునేందుకు పోటీ పడ్డారు మందుబాబులు. బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా 52, 841 రూపాయల విలువ చేసే లిక్కర్ కొనుగోలు చేసిన బిల్ ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఇప్పుడు అదనంగా మరో 2 గంటల పాటు మద్యం దుకాణాలు తెరిచి ఉంచడంతో సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు. మద్యం దుఖాణాలు తెరుచుకోగానే ఏ రేంజ్ లో సేల్స్ రికార్డ్స్ సృష్టించిందో తెలిసిందే. బాహుబలి సినిమా కలెక్షన్స్ రేంజ్ లో ఉండింది అంటే అతిశయోక్తి కాదు అనుకుంట. ఏది ఏమైనా కరోనా ఇంకా అదుపులోకి రాలేదు కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది.


End of Article

You may also like