సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లో అయితే నిజమో కాదో తెలియకుండా ఫార్వార్డ్ చేస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అందరు ఆన్లైన్ లో ఎక్కువగా ఉంటారని అలుసుగా తీసుకొని కొందరు ఇలాంటి ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేస్తున్నారు. తాజాగా రేపటి నుంచి వైన్‌షాపులు ఓపెన్‌ చేస్తున్నారనే ఫేక్ న్యూస్ వాట్సాప్ లో ఫార్వార్డ్ అవుతుంది.

Video Advertisement

ఏకంగా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డిపార్ట్‌మెంట్ పేరుతో ఓ ఫేక్‌ జీఓను తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ న్యూస్ పై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఈ ఫేక్ మెసేజ్ సృష్టించిన వారికోసం దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ లు ఫార్వార్డ్ చేయకండి.

source: namasthe telangana