పోలీసులు కారు ఆపారని ఆ యువతి కొరికి… రక్తం పూసి ఎంత హై డ్రామా చేసిందో చూడండి!

పోలీసులు కారు ఆపారని ఆ యువతి కొరికి… రక్తం పూసి ఎంత హై డ్రామా చేసిందో చూడండి!

by Sainath Gopi

ప్రస్తుతం ప్రపంచం అంత కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. చాలామంది ఇళ్లకే పరిమితం అయినప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఎమర్జెన్సీ లేకుంటే తిరగద్దు అని చెప్పిన పట్టించుకోవట్లేదు. వాహనాలు సీజ్ చేసినప్పటికీ ఆగట్లేదు. ఓ మహిళ పోలీసులు తన కారును ఆపారని నడిరోడ్డు మీద పోలీసులపై గట్టిగట్టిగా అరుస్తూ పెద్ద గొడవ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

Video Advertisement

పోలీసులు ఓ కారును ఆపారు. ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడిగారు. అతను మందులు కొనడానికి వెళ్ళాను అన్నారు. ప్రిస్క్రిప్షన్ చూపించమని అడిగితె లేదు అన్నారు. ఇంతలో కారులో నుండి ఓ యువతి దిగి..పోలీసులను దుర్భాషలాడుతూ… అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కొరికింది. దానితో ఆగకుండా కోపంతో ఏం చేయాలో అర్ధంకాక ఆమెకు నుధిటిపై పాత దెబ్బ ఉంటే దాన్ని గిళ్లి రక్తం వస్తుంటే వెళ్లి పోలీస్ డ్రస్‌కు పూసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.


You may also like

Leave a Comment