Home Viral విషాదం: 9వ అంతస్తు నుండి కింద పడిపోయిన మహిళ… (షాకింగ్ వీడియో)

విషాదం: 9వ అంతస్తు నుండి కింద పడిపోయిన మహిళ… (షాకింగ్ వీడియో)

by Mohana Priya

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం చర్చల్లో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, ఘజియాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో 9వ అంతస్తులో నివసించే ఒక మహిళ తన భర్తతో గొడవ పడుతూ కనిపించింది.

Woman falls from 9th floor balcony in Ghaziabad

ఆ తర్వాత బాల్కనీ రెయిలింగ్ మీదకు ఎక్కి, దూకేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆమె భర్త ఆమె చేతిని పట్టుకున్నాడు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన సొసైటీలో నివసించే కొంత మంది ప్రజలు, తమ ఇళ్ల నుండి పరుపులు దుప్పట్లు తీసుకువచ్చి కింద వేశారు. పట్టు జారడంతో 9 వ అంతస్తు నుంచి పడిన ఆ మహిళ నేరుగా వాటి మీద పడింది.

Woman falls from 9th floor balcony in Ghaziabad

కింద పడే సమయానికి ఆ మహిళ ప్రాణాలతోనే ఉంది. ఈ దృశ్యం అంతా అక్కడ వెళ్ళే జనాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నోయిడాలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Woman falls from 9th floor balcony in Ghaziabad

ఈ ఘటనపై విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మహావీర్ సింగ్ స్పందిస్తూ “ఈ వీడియోలో ఉన్న జంట భార్య భర్తలు అని, ఆ మహిళ బాల్కనీ లో నుండి అదుపు తప్పి కింద పడిపోతూ ఉంటే తన భర్త కాపాడడానికి ప్రయత్నించాడు అని, ప్రస్తుతం ఈ ఘటనపై వారికి ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని” తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలోనే ఉన్నారు అని, ఆ మహిళ కోలుకున్న తర్వాత ఆమె నుండి స్టేట్మెంట్ రికార్డు చేసి కేసు విచారిస్తామని చెప్పారు.

Watch video :

You may also like