Ads
భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మహిళ మొదటిసారిగా ఉరికంబం ఎక్కబోతున్నారు. వివరాల్లోకి వెళితే. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం షబ్నమ్ అనే ఒక మహిళ ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా కి చెందిన వారు. షబ్నమ్ ఇంగ్లీషులో ఎంఏ చేశారు. ఐదవ తరగతి మధ్యలో ఆపేసిన (డ్రాప్ అవుట్) సలీం అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు షబ్నమ్.
Video Advertisement
కానీ షబ్నమ్ కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించలేదు. దాంతో సలీంతో కలిసి తన కుటుంబంలోని ఏడుగురు సభ్యులని గొడ్డలితో నరికి చంపారు షబ్నమ్. వీరిలో షబ్నమ్ తండ్రి షౌకత్ అలీ (55), తల్లి హష్మి (50), అన్నయ్య అనీస్ (35), అనీస్ భార్య అంజుమ్ (25), తమ్ముడు రషీద్ (22), కజిన్ రబియా (14), అనీస్ 10 నెలల కుమారుడు అర్ష్ ఉన్నారు.
ఈ సంఘటన 2008 లో జరిగింది. వారిద్దరిని అరెస్ట్ చేసినప్పుడు వారి వయసు 20 దాటింది. షబ్నమ్ ఏడు నెలల గర్భవతి గా ఉన్నారు. ఆ సంవత్సరం డిసెంబర్ లో షబ్నమ్ కి కొడుకు పుట్టాడు. 2010 లో, వీరిద్దరినీ దోషులుగా తేల్చిన అమ్రోహా సెషన్స్ కోర్ట్ వీరిద్దరికీ ఉరిశిక్షను విధించింది.
దాంతో వాళ్ళిద్దరూ హై కోర్ట్, సుప్రీం కోర్ట్ లని ఆశ్రయించారు. సుప్రీం కోర్ట్ కూడా తమ కింది కోర్టు ఇచ్చిన తీర్పుని ఖరారు చేసింది. దాంతో వారిద్దరూ అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు. దాంతో అధికారులు ఉరిశిక్ష అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. తేదీ ఖరారు అయిన తర్వాత షబ్నమ్ ని మధురై లోని జైలులో ఉరి తీస్తారు.
End of Article