500 కోసం ౩౦ కి.మీలు నడిచింది ఆ మహిళ… చివరికి ఏమైందో తెలుసా?

500 కోసం ౩౦ కి.మీలు నడిచింది ఆ మహిళ… చివరికి ఏమైందో తెలుసా?

by Megha Varna

Ads

రాధా దేవి అనే 50 ఏళ్ళు వయసున్న మహిళా వెన్ను సమస్యతో బాధపడుతూ 500 రూపాయల కోసం 30 కిలోమీటర్లు నడిచింది .ఫిరోజాబాద్ కు వెళ్లిన ఆ మహిళా చేతిలో ఏమి డబ్బులు లేకుండా తిరిగి రావాల్సి వచ్చింది . తన జాన్ ధన్ అకౌంట్లో డబ్బులు పడ్డాయేమో ని చూడడానికి బ్యాంకు కు వెళ్ళింది కానీ డబ్బులు పడకపోవడంతో ఇలా నడవాల్సి వచ్చింది .కాగా తన పేరిట జాన్ ధన్ అకౌంట్ తెరిచి లేదని బ్యాంకు అధికారులు తెలిపారు . అయినా సరే మొనెటరీ సహకారంతో SBI సేవింగ్స్ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయ్యాయి .

Video Advertisement

 

రాధా దేవి బ్యాంకు బాలన్స్ 207 రూపాయల నుండి 26 వేల రూపాయలకు పెరిగింది .తన అకౌంట్ లో ఇలా ఎలా డబ్బులు పడ్డాయో అని SBI పచోఖారా బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్ సింగ్ స్పందిస్తూ …29 మంది ఆమెకు వ్యక్తిగతంగా సాయం చేసేందుకు సిద్ధపడ్డారు .ఆమె కథ అంతా తెలిసిన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెగ్వల్ పర్సనల్ అసిస్టెంట్ జిఎ పృథ్వి కూడా ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు ..

 

ప్రత్యేక శ్రద్ద తీసుకోని రాధా దేవికి జాన్ ధన్ ఖాతాను త్వరగా ఓపెన్ చేయించే విధంగా చూస్తామన్నారు . ఆ విధంగా చేస్తే ఆమె అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ అవుతాయని అంతేకాకుండా వెన్ను సమస్యకు కూడా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీం కింద చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు .

 

ఈ సదరు సంఘటనపై రాధా దేవి స్పందిస్తూ …నా సంతోషం మాటల్లో చెప్పలేనని కలలో కూడా అనుకోలేదని అంత ప్రేమను నాపై చూపించారని అన్నారు . లాక్ డౌన్ కారణంగా పనిలోకి వెళ్లి డబ్బులు సంపాదించడానికి అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేసారు .కాగా ఈ క్లిష్ట పరిస్థితులలో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ డబ్బులు సరిపోతాయని హర్షం వ్యక్తం చేసారు రాధా దేవి . ఈ లాక్ డౌన్ సమయంలో 15 ఏళ్ళ కొడుకుతో కలిసి జీరో బ్యాలన్స్ అకౌంట్ ఉందని బ్యాంకు కి వచ్చాను . డబ్బులు జమ అయ్యేది జీరో బాలన్స్ అకౌంట్ కి కాదని జాన్ ధన్ ఖాతాకు అని తెలిసిందని చెప్పారు …


End of Article

You may also like