ఈ ఫోటోలో మెగా ఫ్యామిలీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో మెగా ఫ్యామిలీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

by Mounika Singaluri

Ads

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముళ్లు చెల్లెలితో కలిసి దిగిన ఫోటోలు ఫ్యాన్స్ కు ఆనందాన్నిస్తున్నాయి

Video Advertisement

.అయితే ఈ ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఒక గ్రూప్ ఫోటోలో ఒక ఆమె అందర్నీ ఆకర్షిస్తుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజేనోవా…!ఈ ఫోటోలో ఆమె అచ్చం తెలుగింటి ఆడపడుచుల చీరలో కనిపించే అందర్నీ ఆశ్చర్యపరిచింది.

రాజకీయంగా పవన్ కళ్యాణ్ వివాహం గురించి చాలామంది ఏదేదో మాట్లాడుతారు అవన్నీ పటా పంచలు చేయడానికి కూడా ఈ ఒక్క ఫోటో చాలు అంటూ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. క్రిస్టియన్ సాంప్రదాయానికి చెందిన అన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హిందూ సాంప్రదాయానికి మారి మెగా కుటుంబ పద్ధతులను పాటిస్తున్నారు.ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరింత సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భార్యల గురించి విమర్శించే వారికి నోటికి తాళం వేసినట్లు అయిందని ఇంటర్నెట్ లో కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ మెగా బ్రదర్ నాగబాబు-పద్మజ పవన్ కళ్యాణ్-అన్నా కలిసి దిగిన ఫోటో మాత్రం చూడముచ్చటగా ఉంది.మరోపక్క వరుణ్ తేజ్ లావణ్యలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా ఎంతో అందంగా ఉన్నారు. లావణ్య అయితే పెళ్లి జరిగాక ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. పెళ్లిలో వరుణ్ తేజ్ క్రీమ్ గోల్డ్ షేర్వానీని ధరించి చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. అటు లావణ్య త్రిపాఠి కూడా ప్రత్యేకంగా కూర్చిన కాంచీపురం చీరలో అద్భుతంగా కనిపించింది. వీరు పెళ్లికి డ్రస్సులు డిజైన్ చేసింది ఇండియాలోనే సెలబ్రిటీలకు వెడ్డింగ్ డిజైనర్ గా పేరు ఉన్న మనిష్ మల్హోత్రా.ఈరోజు సోషల్ మీడియా మొత్తం మెగా ఫ్యామిలీ ఫోటోలతో నిండిపోయింది.

Also Read:వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి ఇంత ఖర్చు అయ్యిందా..? పెళ్లి బట్టల కాస్ట్ ఎంత అంటే..?


End of Article

You may also like