Ads
హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలో చేస్తున్న హీరోయిన్స్ లో ముందు వరుసలో ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు శ్రీలీల. ఇప్పుడు కూడా శ్రీలీల చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. కొన్ని షూటింగ్ దశలో ఉంటే, కొన్ని డిస్కషన్స్ దశలో ఉన్నాయి.
Video Advertisement
శ్రీలీల అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది డాన్స్. శ్రీలీలకి వివిధ డాన్స్ ఫార్మ్స్ వచ్చు. కొన్ని రకమైన డాన్స్ లలో శ్ర లీల శిక్షణ పొందారు. కొన్ని క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ అయితే, మరికొన్ని వెస్ట్రన్ డాన్స్ కి సంబంధించినవి. అందుకే ఏ రకమైన డాన్స్ అయినా సరే శ్రీలీల ఎంతో సులభంగా వేస్తారు.
శ్రీలీల ఉన్న సినిమాలో ఒక్క డాన్స్ నంబర్ అయినా ఉంటుంది. ఆ పాటలో డాన్స్ కూడా హైలైట్ అవుతుంది. అయితే శ్రీలీల ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో శ్రీలీల శాస్త్రీయ నృత్యం చేస్తున్నారు. ఇది పాత ఫోటో అని శ్రీలీల క్యాప్షన్ లో రాశారు. శ్రీలీలతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఈ ఫోటోలో ఉన్నారు. ఆమెకి కూడా శ్రీలీల థాంక్స్ చెప్తూ పోస్ట్ లో ఒక లైన్ రాశారు. ఆమె ప్రముఖ నటి, గొప్ప నృత్యకారిణి మంజు భార్గవి గారు. ఎన్నో సినిమాల్లో, ఎన్నో సీరియల్స్ లో నటించి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి మంజు భార్గవి గారు.
మంజు భార్గవి గారి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో శాస్త్రీయ నృత్యం వచ్చిన హీరోయిన్స్ లో ముందు ఉంటారు మంజు భార్గవి గారు. మంజు భార్గవి గారు ఈటీవీలో యమలీల సీరియల్ లో నటించారు. తెలుగు మాత్రమే కాదు. తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా మంజు భార్గవి గారు నటించారు. తంగం అనే ఒక తమిళ్ సీరియల్ లో కూడా మంజు భార్గవి గారు యాక్ట్ చేశారు. గంగ అనే మరొక తమిళ్ సీరియల్ లో కూడా మంజు భార్గవి గారు నటించారు.
ఆ తర్వాత తెలుగులో 2021 లో అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ లో, ఆ తర్వాత యమలీల సీరియల్ లో నటించారు. సినిమాలు, సీరియల్స్ లో నటించడంతో పాటు, కొన్ని డాన్స్ షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరించారు. మంజు భార్గవి గారు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. మంజు భార్గవి గారి భర్త ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో ఒకరు 2007 లో క్యాన్సర్ కారణంగా మరణించారు. మంజు భార్గవి గారు బెంగళూరులో ఒక డాన్స్ స్కూల్ నడుపుతున్నారు. ఈ కారణంగానే మంజు భార్గవి గారికి సినిమాల్లో నటించే సమయం ఉండట్లేదు. కానీ ఆమెని మళ్లీ సినిమాల్లో నటిస్తే చూడాలి అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ALSO READ : VYOOHAM REVIEW : “రామ్ గోపాల్ వర్మ” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article