Ads
బస్సు లేదా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో పక్కన ఉన్నవారితో మాటలు కలపడం అనేది సర్వ సాధారణంగా జరిగే విషయం. ఆ ఇద్దరి వ్యక్తుల అభిరుచులు లేదా ఆలోచనలు ఒకేలా ఉంటే వారి చర్చలకు అవధి ఉండదు. అది అభిమానం అయినా ఫ్రస్ట్రేషన్ అయినా కావచ్చు.
Video Advertisement
తాజాగా అలాంటి చర్చే మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరి మహిళల మధ్య జరిగింది. ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి వారి మొదలైన చర్చ, ప్రధాని మోదీ వరకు వెళ్ళింది. వీరి చర్చకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నెలరోజులు దాటిన ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు నిరసనలు, ఆందోళన తెలుపుతున్నారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా ఆయన మద్ధతుదారులు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు స్త్రీల మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలో వారిద్దరూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి నెల దాటినా, ఇప్పటికి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని వారి ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. చంద్రబాబు అరెస్టు పై ఇప్పటికీ రెస్పాండ్ కాలేదు అని తిడుతూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌ను వెళ్ళగక్కారు. వారిలో ఒక మహిళ, నోరు తెరిస్తే ధర్మం, హిందుత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రధాని, తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అరాచకాల గురించి ఒక్కసారైన మాట్లాడలేదని అన్నారు. ఇండియా వరల్డ్ లో టాప్ 3 ప్లేస్ కి వచ్చిందని అంటారు. కానీ రోడ్ల పై నడిచే మహిళలకు టాయిలెట్లు కూడా లేని పరిస్థితిలో ఉందని ఇంకో మహిళ అన్నారు. ప్రపంచంలో 3 స్థానం కాదు, ముందు రోడ్ల పై వెళ్ళే స్త్రీల కోసం టాయిలెట్లు కట్టించి, గొప్పలు చెప్పుకోవాలి అని తన కోపాన్ని బయటపెట్టింది. వీళ్ల సీరియస్ చర్చను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
watch video :
చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద మోడీ స్పందించలేదు అని దొంగ సచ్చినోడు, ముదనష్టపొడు నాశనం అయిపోవాలని తిట్టిన టీడీపీ కార్యకర్తలు pic.twitter.com/VIAG1aNhBY
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2023
End of Article