Ads
వరంగల్ లో మహిళల రాజ్యం ఏర్పడింది. చాలా కాలంగా మహిళలు అనేక రంగాలలో రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. సొసైటీలో ఆడవాళ్ల అధికారం ఎందరో ఆడవాళ్ళకి స్ఫూర్తిని ఇస్తుంది.
Video Advertisement
ఇప్పుడు వరంగల్ లో అలాంటి ఒక మహిళల రాజ్యం పలువురు దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ పాలించే నేత, శాసించే అధికారి చాలామంది మహిళలే.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొండా సురేఖ,సీతక్క అనబడే దనసరి అనసూయ మంత్రులుగా అధికారం చేపడితే, వరంగల్,హనుమకొండ, ములుగు జిల్లాల కలెక్టర్లుగా ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ల హోదాలో మొన్న జరిగిన ఎన్నికలలో సమర్థవంతంగా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు.
రాష్ట్రంలోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం లో చరిత్ర సృష్టించారు. ఇందులో ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలలో చేరటానికి ముందు 15 సంవత్సరాలకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు.
అటు పై జనస్రవంతిలో కలిసి ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా ఎదిగిన తీరు నిజంగా ప్రశంసనీయం. అలాగే ప్రస్తుత తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ 1965లో పుట్టి 1985లో ఎల్.వి కళాశాల నుంచి బీకాం పూర్తి చేశారు. 1995 లో కొండా సురేఖ మండల పరిషత్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు ఆపై ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
అప్పటినుంచి ఇప్పటివరకు సాగిన ఆమె రాజకీయ ప్రస్థానం పలువురు స్త్రీలకి ఆదర్శం. అలాగే 26 ఏళ్ల వయసుకే ఎన్నికలలో పోటీ చేసి 37 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ దిగ్గజం ఎర్రబెల్లి దయాకర్ పై పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా నేటి యువతకి ఆదర్శం. వీరందరూ తమ తమ రంగాలలో రాణిస్తూ పలువురు మహిళలకు స్ఫూర్తిగా నిలవడం నిజంగా అభినందనీయం.
End of Article