ఒకప్పుడు భర్తతో విడాకులు ఇప్పించమని ఆ షోకి వచ్చిన మహిళ…ఇప్పుడు ఎలా మారిందో చూస్తే షాక్ అవుతారు.!

ఒకప్పుడు భర్తతో విడాకులు ఇప్పించమని ఆ షోకి వచ్చిన మహిళ…ఇప్పుడు ఎలా మారిందో చూస్తే షాక్ అవుతారు.!

by Megha Varna

Ads

భార్య భర్తల మధ్య గొడవలు పరిష్కరించడానికి కొన్ని షోలు వచ్చాయి. ఈ షోల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  భారీ పాపులారిటీని కూడా ఇవి దక్కించుకున్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా ఈ రియాలిటీ షోలు బాగా పాపులర్ అయ్యాయి. యూట్యూబ్ లో కూడా ఎక్కువగా వ్యూస్ వస్తూ ఉంటాయి.

Video Advertisement

తమిళ సినీ నటి లక్ష్మి రామ కృష్ణన్ హోస్ట్ గా నిర్వహించిన షో కి బాగా పాపులారిటీ వచ్చింది. అయితే లక్ష్మీ రామకృష్ణన్ హోస్ట్ గా తమిళ్ లో నిర్వహించిన షో కి బాధితురాలిగా ఒక వివాహిత వచ్చింది. ఆమె ఇప్పుడు మాతగా అవతారమెత్తింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… న్యూస్ 18 కథనం ప్రకారం…లక్ష్మీ రామకృష్ణన్ షోలో బాధితురాలిగా కనబడిన ఒక ఆమె ఇప్పుడు మాతగా మారిపోయింది.

ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా ఆమెని ఆశీర్వదించిమని అంటూ భక్తులు క్యూ కడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. న్యూస్ 18 కధనం ప్రకారం ఆ మహిళ పేరు అన్నపూర్ణి. 2014లో లక్ష్మీ రామకృష్ణన్ రియాలిటీ షోలో ఆమె వచ్చారు. మరొక మహిళ భర్త తో జీవించాలని.. విడాకులు ఇవ్వాలని ఆమె అన్నారు.

ఫైనల్ గా ఏదో సెటిల్మెంట్ చేసి వాళ్ళని పంపించారు.  ఆమె ఆదిశక్తి అంటూ ప్రచారం చేసుకుంది. అందరికీ ఆశీర్వచనాలు ఇస్తోంది. ఆమె వద్దకు వచ్చి కొందరైతే దండాలు పెడుతున్నారు. కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు.

ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి నెటిజన్లకు. కొంత మంది ఆమెను డైరెక్ట్ గా కలిసి ఆశీర్వచనాలు పొందాలి అని అనుకుంటున్నారు. మరికొందరైతే ఏమిటి ఈమె ఆదిశక్తా అంటూ మండి పడుతున్నారు. ఇక ఈ విషయంపై నటి లక్ష్మీ రామకృష్ణన్ ఏమన్నారంటే.. అన్నపూర్ణి వీడియోలు చూడగానే నవ్వు వచ్చిందని అన్నారు. పైగా ఈమె కొందర్ని టార్గెట్ చేసి మోసం చేస్తోందని అన్నారు.


End of Article

You may also like