Ads
ప్రియురాలిని హత్య చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఇది చోటు చేసుకుంది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలి గొంతు కోసి హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం కి తరలించగా అసలు విషయం బయట పడింది.
Video Advertisement
బాలిక ఆత్మహత్య పై ధరమ్‌జయ్‌గఢ్ పోలీసులు రాసిన నివేదికతో అసలు విషయం బయటకు వచ్చింది. బాలిక తో కలిసి సహజీవనం చేస్తున్న యువకుడు ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది. కానీ ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు.
దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పై జైలుకు తరలించారు. నిందితుడు అమర్ సింగ్ మంజ్వార్ ఝోర్ఖాపరా ధరమ్‌జయ్‌గర్ గ్రామం లో ఉంటున్నాడు. అమర్ సింగ్ గత ఏడాది కోర్బా గ్రామానికి చెందిన ధనిరామ్ బైగా కుమార్తె సోన్మతి బైగాను తీసుకు వచ్చాడు.
అందరితో ఆమె అతని భార్య అని చెప్పి నమ్మించాడు. ఆఖరికి ఆమెని చంపేసి సినిమా స్టోరీ మాదిరి మార్చడానికి చూసాడు. కానీ ఆఖరికి పోలీసులకి చిక్కక తప్పలేదు. డిసెంబర్ 11 న సాయంత్రం 4 గంటల ప్రాంతం లో గుర్మా గ్రామం నుంచి తను వచ్చే సరికి ఇంట్లో ఆమె లేదని బయటకు వెళ్లిందని.. తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ఆమెను వెతకడానికి చెరువు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి మృతురాలు ఉరి వేసుకొని ఉంది. అయితే విచారణలో సాక్షులు చెప్పిన విషయాలు భిన్నంగా ఉండటం తో పోలీసులు విచారణ చేశారు. దీంతో ఆమెని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇలా ఆఖరికి పోలిసుల చేతికి చిక్కాడు.
End of Article