Ads
ఒకప్పుడు సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడం, అభిమాన హీరో సినిమా అయితే మరోసారి వెళ్ళి చూసేవారు. ఆ మూవీ కొన్నేళ్ళ తారువాత టీవీల్లో ప్రసారం అయితే చూసి మరోసారి చూసి ఎంజాయ్ చేసేవారు. వాటిలో అభిమాన తరాల డైలాగ్స్, డ్యాన్స్, పాటలు గుర్తుపెట్టుకునేవారు.
Video Advertisement
అయితే ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక సినిమాలను చేసే యాంగిలే ఛేంజ్ అయిపోయింది. మూవీని థియేటర్‌లో వీక్షించినపుడు కథ, నటన, మేకింగ్ పై మాత్రమే దృష్టిపెట్టే ఆడియెన్స్, ఓటీటీలో చాలాసార్లు చూస్తూ, ప్రతి దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజాగా యనిమాల్ మూవీలో నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో వైరల్ గా మారింది. దాని లాగే ఏ ఏ సినిమాలలో ఒక పదం ఎన్నిసార్లు రిపీట్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం..
1. యానిమల్ – నాన్న ( పాపా ):
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన యనిమాల్ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాన్నను అమితంగా ప్రేమించే కొడుకుగా రణబీర్ కపూర్ నటించారు. తండ్రిగా అనిల్ కపూర్ గా నటించగా, ఈ మూవీలో రణబీర్ నాన్న (పాపా) అని చాలా సార్లు పిలుస్తాడు. అలా నాన్న అనే పదం దాదాపుగా 196 సార్లు రిపీట్ గా అయినట్టు తెలుస్తోంది.
2. ఖడ్గం – నువ్వు నువ్వు:
కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఖడ్గం. ఈ మూవీలో శ్రీకాంత్ కు జంటగా హీరోయిన్ సోనాలి బింద్రే నటించింది. వీరి మధ్య వచ్చే ‘నువ్వు నువ్వు’ అంటూ వచ్చిన పాట సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ పాటలో నువ్వు నువ్వు అనే పదం 90సార్లకు పైగా రిపీట్ అయ్యింది.
3. ఆచార్య – పాదగట్టం:
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ మూవీ కథ పాదఘట్టం అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఈ పదాన్ని మూవీలో 90సార్లకు పైగా పలకడం విశేషం.
4. బ్రహ్మాస్త్ర – శివ:
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ హిందీ మరియు తెలుగులో కూడా హిట్ అయ్యింది. ఈ మూవీలో రణబీర్ కపూర్ శివ అనే పాత్రలో నటించారు. ఈ మూవీలో శివ అనే పదం 103 సార్లు రిపీట్ అయ్యింది.
Also Read: సోనాలి బింద్రే నుండి హంసా నందిని వరకు… “క్యాన్సర్” బారిన పడిన 5 హీరోయిన్స్.!
End of Article