చిత్రం: వరల్డ్ ఫేమస్ లవర్

నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్ తెరెసా, ఇజాబెల్లె తదితరులు

నిర్మాత: కె.ఎ.వల్లభ

దర్శకత్వం: క్రాంతి మాధవ్

మ్యూజిక్: గోపీ సుందర్

విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020

కథ:
గౌతమ్‌ (విజయ్ దేవరకొండ) ను జైలు లో కొట్టే సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. యామిని (రాశీ ఖన్నా)తో లవ్ స్టోరీ ముందుగా వస్తుంది. తర్వాత బ్రేక్ అప్ అవుతారు. అక్కడి నుంచి స్టోరీ ఎల్లందు బొగ్గు గనులకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ విజయ్ దేవరకొండ శీనయ్యగా కనిపిస్తాడు. ఆ కథ ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది ట్విస్ట్. అప్పటికే సువర్ణ (ఐశ్వర్య రాజేష్)తో పెళ్లయి పిల్లాడు ఉన్న సీనయ్య కోల్ మైన్ వెల్ఫేర్ ఆఫీసర్ స్మిత (కేథరిన్)తో ప్రేమలో పడతాడు. దీని తర్వాత కథ పారిస్ కి షిఫ్ట్ అవుతుంది. ఇజాబెల్లెతో ప్రేమలో పడతాడు విజయ్. వీళ్ళందరికీ ఏమైనా కనెక్షన్ ఉందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
దర్శకుడు మాధవ్ డిఫ్రెంట్ స్టోరీతో వచ్చినప్పటికీ క్లైమాక్స్ లో అదే మూసపద్ధతిలో ఎండ్ పలుకుతాడు. విజయ్, రాశికన్నా, ఐశ్వర్య రాజేష్ లు యాక్టింగ్ పరంగా వదిగిపోయారు.ఫస్ట్ ఆఫ్ బాగున్నప్పటికీ సెకండ్ ఆఫ్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దర్శకుడు సెకండ్ ఆఫ్ లో ఎమోషనల్ కాస్త ఎక్కువగా చూపించాలని ప్రయత్నించినప్పటికీ పండించటంలో నటి, నటులు ఫెయిల్ అయ్యారనిచెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

విజయ్, రాశికన్నా, ఐశ్వర్య రాజేష్ ల యాక్టింగ్

పారిస్ సన్నివేశాలు

శీనయ్య పాత్ర

ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

స్లో గా సాగే సన్నివేశాలు

బోరింగ్ సీన్స్

క్లైమాక్స్

సెకండ్ హాఫ్

సాంగ్స్

రేటింగ్: 2.5/5
టాగ్ లైన్: ముల్టీఫ్లెక్ సినిమా కావటంతో కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. ఫేమస్ లవర్ అవేరేజ్ అనే చెప్పాలి

If you want to contribute content on our website, click here

Cryptoknowmics
Sharing is Caring:
No more articles