Ads
ఒక చేతితో ఫోన్ చూసుకుంటూ మరో చేతితో ఆహారం తీసుకునే విధానం చాలా ప్రమాదకరం.దీని వల్ల అసలు మనం ఏం తింటున్నాం అనేది కూడా తెలియకుండా పోతుంది.ఈ విధానాన్ని అవలంబిస్తే మీ భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది అని పరిశోధకులు హెచ్చరిస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు.
Video Advertisement
తాజగా వెలుగు చూసిన ఓ సంఘటనను ఇప్పుడు పరిశోధకులు చూపిస్తూ జాగ్రత్తగా ఉండండి అంటూ మనల్ని హెచ్చరిస్తున్నారు.ఇంతకీ ఆ సంఘటన ఏంటో? దాని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.టోక్యోకు చెందిన 25 ఏళ్ల మహిళ తరచూ గొంతు నొప్పితో బాధపడుతుండేది.ఈ కారణంగా ఇటీవల సెయింట్ లూకాస్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరింది.
జపనీస్ వంటకం షాషిమి అంటే (చేప లేదా మాంసాన్ని పచ్చి ముక్కలుగా చేసుకొని తినే వంటకాన్ని) తిన్నప్పటి నుండి తనకు ఇలాంటి సమస్య వస్తుందని డాక్టర్లకు చెప్పింది. దీనితో డాక్టర్లు ఆమెకు పరీక్షలు చేసి ఆమె గొంతులో 1 మీటర్ వెడల్పు 1.5 మీటర్ల పొడువు ఉన్న ఒక పురుగును గుర్తించారు.అనంతరం చికిత్స చేసి దానిని తొలగించారు.పురుగు తొలగించాక ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుట పడింది.ఆ పురుగును వానపాముగా గుర్తించారు.అదింకా బ్రతికి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
End of Article