ప్రముఖ మొబైల్ సంస్థ షావోమి  చాలా రోజుల తరువాత  5జీ సపోర్టుతో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను శుక్రవారం లాంచ్ చేసింది.Mi 10 ఫోన్ ఇప్పటికే మనదేశంలో లాంచ్ కావాల్సి ఉన్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. షావోమి ఎంఐ 10 పేరుతో ఈ మొబైల్ ను  భారత మార్కెట్లో తీసుకొచ్చింది.

Video Advertisement

108 మెగా పిక్సల్‌ ప్రైమరీ కెమెరా కలిగి ఉండటం ఈఫోన్‌ ప్రత్యేకత.   8K  వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది.  షియోమీ ఎంఐ 10 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.  ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను మనదేశంలో రూ.49,999గా నిర్ణయించారు.ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. మే  12 నుంచి ఎంఐ.కామ్, అమెజాన్ ద్వారా లభ్యం.

Mi 10 5G స్మార్ట్‌ఫోన్‌  ప్రత్యేకతలు ఇవే :

6.67అంగుళాల అమోలెడ్ డిస్‌

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 విత్  అడ్రినో 650జీపీయు

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌

108 ఎంపీ క్వాడ్‌ కెమెరా+ఓఐఎస్‌

20 ఎంపీ సెల్పీ  కెమెరా

4780 ఎంఏహెచ్  బ్యాటరీ  

3D Curved E3(AMOLED) డిస్‌ప్లే

క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865

30W వైర్‌డ్‌ అండ్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

10W రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

Mi 10 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలు ఇవే :

8 GB RAM + 128 GB స్టోరేజ్‌: ధర:  49,999

8 GB RAM + 256 GB స్టోరేజ్‌: ధర:  54,999

ఎం‌ఐ 10 5జి లాంచ్ ఆఫర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల ద్వారా  3,000 రూపాయలు తగ్గింపు ఇస్తుంది….ప్రీ ఆర్డర్ చేసిన కస్టమర్లకు  రూ. 2499  విలువ చేసే పవర్ బ్యాంకు ఉచితం.