ఒకప్పటి యాంకర్ జాహ్నవి గుర్తున్నారా.? తనకంటే 20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా.?

ఒకప్పటి యాంకర్ జాహ్నవి గుర్తున్నారా.? తనకంటే 20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా.?

by Mohana Priya

గోపీచంద్ కెరీర్ లో బెస్ట్ సినిమాల జాబితాలో ఉండే సినిమా యజ్ఞం. 2004లో వచ్చిన ఈ సినిమాకి ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించారు. యజ్ఞం సినిమాలో సమీరా బెనర్జీ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి కథ, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ ప్లస్ పాయింట్ అయ్యాయి. వాటితో పాటు మరొక ప్లస్ పాయింట్ అయింది కామెడీ.

Video Advertisement

yagnam fame jahnavi ellore

అందులోనూ ముఖ్యంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి, హీరోయిన్ ఫ్రెండ్ కి మధ్య వచ్చే సీన్స్ అయితే ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటాయి. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించారు జాహ్నవి. జాహ్నవి అంతకుముందు యాంకరింగ్ కూడా చేసేవారు. యజ్ఞం సినిమాతో జాహ్నవి ఇంకా ఎంతోమందికి చేరువయ్యారు.

యజ్ఞం సినిమాలో మాత్రమే కాకుండా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ సినిమాలో కూడా జెనీలియాకి స్నేహితురాలిగా నటించారు జాహ్నవి. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి జాహ్నవి ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం జాహ్నవికి పెళ్లి అయింది.

yagnam fame jahnavi ellore

జాహ్నవి భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. ఆయనే రసూల్ ఎల్లోర్. గాయం, మనీ మనీ, గులాబీ, లిటిల్ సోల్జర్స్, జల్సా వంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు రసూల్ ఎల్లోర్. శ్రీరామ్, ఆర్తి చాబ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ఒకరికి ఒకరు సినిమాతో డైరెక్షన్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత భగీరథ, సంగమం సినిమాలకి దర్శకత్వం వహించారు. రసూల్ జాహ్నవి కంటే దాదాపు 20 సంవత్సరాలు పెద్ద.

yagnam fame jahnavi ellore

సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ లో  గాయం, నువ్వు నేను సినిమాలకి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నంది అవార్డును, అలాగే ఒకరికి ఒకరు సినిమాకి బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ గా కూడా నంది అవార్డుని అందుకున్నారు రసూల్ ఎల్లోర్. జాహ్నవి సినిమాలకు దూరం అయినా కానీ ఇండస్ట్రీకి దూరం అవ్వలేదు. 2019 లో అడవి శేష్, రెజీనా హీరో హీరోయిన్లుగా వచ్చిన ఎవరు సినిమాకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు జాహ్నవి.


You may also like