Home Filmy Adda ”యష్” అభిమాన హీరోలు ఎవరో తెలుసా..?

”యష్” అభిమాన హీరోలు ఎవరో తెలుసా..?

by Megha Varna

రాకింగ్ స్టార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. కేజిఎఫ్ సినిమా వచ్చినప్పటి నుండి కూడా రాఖీ బాయ్, రాఖీ బాయ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా గురించి చూస్తే.. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది.

మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు?

the two movies of poori which rejected by rocking star yash..!!

మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఈ కేజీఎఫ్ హీరో యష్. ఏకంగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయారు ఈ హీరో. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో యష్ కొన్ని విషయాలు చెప్పారు. తనకి ఇష్టమైన నటులు గురించే యష్ ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆయనకి చాలా మంది రోల్ మోడల్స్ ఉన్నారట. శంకర్ నాగ్, అంబరీష్, రాజ్ కుమార్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హసన్.. వీరందరూ కూడా యష్ కి రోల్ మోడల్స్ అని చెప్పారు. వీళ్లే కాకుండా ఇంకా చాలామంది నటులకి నేను వీరాభిమానిని అని చెప్పారు. అంతేకాక రజనీకాంత్ చాలా ఇష్టం అని రజనీకాంత్ నుంచి ఎన్నో విషయాలని నేర్చుకున్నాను అని యష్ చెప్పారు. యష్ ని ఆయన చాలా ప్రభావితం చేశారట. ఇది ఇలా ఉంటే కేజిఎఫ్ సినిమా విడుదల అవ్వకముందు కమలహాసన్ నటన భగవద్గీత, రజనీకాంత్ నాకు దేవుడు అని కూడా చెప్పారు యష్.

You may also like