ఈసారి రాకీ భాయ్ ఇలా ప్లాన్ చేసాడా..? “యష్” నెక్స్ట్ సినిమా కథ ఇదేనా..?

ఈసారి రాకీ భాయ్ ఇలా ప్లాన్ చేసాడా..? “యష్” నెక్స్ట్ సినిమా కథ ఇదేనా..?

by Mohana Priya

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.

Video Advertisement

కానీ ఈ మధ్య కన్నడ, మలయాళం హీరోల సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. వారికి కూడా చాలా పాపులారిటీ వస్తోంది. అలా ఇటీవల కాలంలో తెలుగులో పాపులర్ అయిన హీరో యష్. యష్ కన్నడ హీరో అయినా కూడా తెలుగులో చాలా గుర్తింపు సంపాదించుకున్నారు.

అందుకే ఇప్పుడు యష్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం బయటికి వచ్చింది. యష్ నెక్స్ట్ సినిమా పిరియాడిక్ డ్రామాగా ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. అంటే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథతో ఈ సినిమా ఉంటుంది. గత సినిమా చారిత్రాత్మక నేపథ్యం కాకపోయినా చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథలాగా ఆ సినిమా చూపించారు.

kgf chapter 2 movie review

ఇప్పుడు ఈ సినిమా ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగిన కథలాగా చూపిస్తారు. ఇందులో అలాంటి పాత్రలోనే యష్ కనిపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే పూజా హెగ్డే నటిస్తున్న మొదటి కన్నడ సినిమా ఇదే అవుతుంది. కేజీఎఫ్ లాగానే ఈ సినిమా కూడా కన్నడలో చిత్రీకరించి మిగిలిన భాషల్లో డబ్ చేస్తారు. పాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా కూడా విడుదల అవుతుంది. ఈ సినిమాకి నర్తన్ దర్శకత్వం వహిస్తారు అని సమాచారం. నర్తన్ అంతకుముందు ముఫ్తీ అనే సినిమాకి దర్శకత్వం వహించారు.

అంతే కాకుండా ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా భారీ స్థాయిలో కొనుగోలు చేయాలి చాలా ఓటీటీ సంస్థలు ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో విలన్ పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు అని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే కేజీఎఫ్ తర్వాత మళ్లీ ఈ సినిమాలో వారిద్దరూ కలిసి నటిస్తారు. ఈ సినిమా కోసం యష్ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇది మాత్రమే కాకుండా కేజీఎఫ్ మూడవ పార్ట్ కూడా వస్తుంది అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాల కోసం కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


End of Article

You may also like