Ads
తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ నుండి మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి ఆమె విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు.
Video Advertisement
ఒకసారి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే… యశస్విని రెడ్డి 1997 సంవత్సరంలో హైదరాబాదులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మాధవి. యశస్విని రెడ్డికి ఒక చెల్లెలు కూడా ఉంది. టెన్త్ క్లాస్ వరకు ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లో చదివారు.
2018లో హైదరాబాదులోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి బిటెక్ పూర్తి చేశారు. తర్వాత 2019 సంవత్సరంలో ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి ల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి తో వివాహం జరిగింది. వీరి పెళ్లి సంగీత కార్యక్రమంలో బాహుబలి సినిమాలోని అనుష్క ప్రభాస్ గెటప్పులు వేసి వీరు డాన్స్ కూడా చేశారు. అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి టికెట్ పౌరసత్వం విషయంలో చిక్కుల రావడంతో ఆ టిక్కెట్ యశస్విని రెడ్డికి దక్కడం ఆమె ఎమ్మెల్యే గా నెగ్గడం జరిగింది.
ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించేవారు. బాగా సంపాదించి తన సొంత ఊరికి ఎంత కొంత మేలు చేయాలని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు. యశస్వి రెడ్డి కూడా అమెరికాలో కంపెనీ వ్యవహారాలు చూసుకుని వారు. తర్వాత ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఎస్ఎస్సి రెడ్డికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేకి నెగిన తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెడతానని ప్రకటించారు
End of Article