Home Filmy Adda నిరీక్షణ “అర్చన”తో పాటు… మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆనాటి 10 హీరోయిన్లు..!

నిరీక్షణ “అర్చన”తో పాటు… మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆనాటి 10 హీరోయిన్లు..!

by Mohana Priya

సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకి సినిమాల్లో హీరోయిన్‌గా నటించే కాలం తక్కువగా ఉంటుంది అని అంటారు. చాలా వరకు అది నిజమే. అప్పట్లో హీరోలుగా నటించిన ఎంతో మంది హీరోలు ఇప్పటికి కూడా హీరోలుగా నటిస్తున్నారు. కానీ అప్పుడు హీరోయిన్లుగా నటించిన చాలా మంది హీరోయిన్లు మాత్రం ఇప్పుడు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అప్పట్లో హీరోయిన్లుగా నటించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న చాలా మంది, తర్వాత కొంత కాలానికి సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయారు. మళ్లీ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా కొంత మంది అప్పటి హీరోయిన్లు మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 అర్చన

నిరీక్షణ సినిమాతో పాపులర్ అయిన అర్చన, ఇప్పుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

yesteryear heroines who are making comeback into movies

#2 భాగ్యశ్రీ

అప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూడా రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తున్నారు.

yesteryear heroines who are making comeback into movies

#3 రవీనా టాండన్

బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా కేజీఎఫ్ 2 సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు.

yesteryear heroines who are making comeback into movies

#4 రాధిక

స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు.

yesteryear heroines who are making comeback into movies

#5 అమల

అమల కూడా ఒకే ఒక జీవితం సినిమాలో నటిస్తున్నారు.

yesteryear heroines who are making comeback into movies

#6 ఆమని

ఆమని కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించారు. తర్వాత చాలా సినిమాల్లో నటిస్తున్నారు.

yesteryear heroines who are making comeback into movies

#7 ఇంద్రజ

ఇంద్రజ కూడా రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న స్టాండప్ రాహుల్ సినిమాలో నటించారు.

yesteryear heroines who are making comeback into movies

#8 మధుబాల

హీరోయిన్ మధుబాల కూడా శాకుంతలం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

yesteryear heroines who are making comeback into movies

#9 ఖుష్బూ

ఖుష్బూ కూడా డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించడం తక్కువ. ఇటీవల ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటించారు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

yesteryear heroines who are making comeback into movies

#10 గౌతమి

గౌతమి కొంతకాలం క్రితం మనమంతా సినిమాలో నటించారు. ఇప్పుడు శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు.

yesteryear heroines who are making comeback into movies

వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్లు ఇటీవలి కాలంలో ముఖ్య పాత్రల్లో రీ-ఎంట్రీ ఇచ్చారు.

You may also like