36 ఏళ్లకి కేంద్ర మంత్రి అయిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? 26 ఏళ్ళకి ఎంపీగా కూడా..?

36 ఏళ్లకి కేంద్ర మంత్రి అయిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? 26 ఏళ్ళకి ఎంపీగా కూడా..?

by Harika

Ads

నిన్న నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే కొత్త మంత్రివర్గం కూడా ఏర్పడింది. వారిలో క్యాబినెట్ మంత్రిగా ఎంపిక అయ్యారు రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ. శ్రీకాకుళం నుండి పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు కూడా మూడోసారి ఎంపీగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడు గారి కొడుకు. కింజరాపు ఎర్రన్నాయుడు గారు 2012 లో మరణించారు. అప్పుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లో, 2019 లో, పాటు 2024 లో కూడా శ్రీకాకుళం నుండి ఎంపీ పదవికి పోటీ చేసి గెలిచారు.

Video Advertisement

young cabinet member ram mohan naidu

మొదటిసారి రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచిన సమయానికి ఆయన వయసు 26 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు 36 సంవత్సరాలకి కేంద్ర మంత్రి అయ్యారు. ఇంత చిన్న వయసులోనే కేంద్ర మంత్రి అయిన మొదటి వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు ఘనత సాధించారు. రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో పుట్టారు. బీటెక్, ఎంబీఏ చదువుకున్నారు. 2017 లో తెలుగుదేశం పార్టీ సీనియర్ అయిన బండారు సత్యనారాయణమూర్తి గారి చిన్న కూతురు శ్రావ్యని రామ్మోహన్ నాయుడు పెళ్లి చేసుకున్నారు. రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని కూడా 2019 లో రాజమండ్రిలో అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

రామ్మోహన్ నాయుడు బాబాయి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు గారు టెక్కలి నుండి శాసనసభ్యుడిగా గెలుపొందారు. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పదవిలో కూడా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో కన్సల్టేటివ్ కమిటీ, హోమ్‌ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ, అధికార భాష, వెకబడిన వర్గాల సంక్షేమ కమిటీలలో సభ్యుడిగా కూడా చేస్తున్నారు. యువతలో రామ్మోహన్ నాయుడుకి చాలా మంది అభిమానులు ఉన్నారు. పార్లమెంట్ చర్చా వేదికల్లో రామ్మోహన్ నాయుడు మాట్లాడిన స్పీచ్ లు చాలా ఫేమస్ అయ్యాయి. అందులో ఆయన ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించారు. తెలుగుతో పాటు, హిందీ, ఇంగ్లీష్ లో కూడా రామ్మోహన్ నాయుడు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఘనతని సాధించిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.


End of Article

You may also like