Ads
వైయస్ షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ప్రాచుర్యం పొందారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి తరఫున 2019 ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ను విడిచిపెట్టి తెలంగాణ చేరి అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించారు.
Video Advertisement
అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు మొదలవులను నేపథ్యంలో వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను షర్మిలాకి అప్పగించనున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. నిన్న కాకినాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయని కుటుంబాలను వేరు చేసే విధంగా రాజకీయాలు చేస్తారని, పొత్తులు పెట్టుకుంటారు, మోసాలు చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. పరోక్షంగా కుటుంబాలను చీల్చుతారు అని చెప్పడంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు పాలు సెట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్న నేపథ్యంలో సీటు దక్కని వారు షర్మిల వెనకాల నడుస్తారని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిల తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
watch video :
End of Article