ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా..? ఒక రోజులో ఏం తింటారు అంటే..?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా..? ఒక రోజులో ఏం తింటారు అంటే..?

by kavitha

Ads

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిట్ గా, ఎలాంటి ఒత్తిడి లేకుండా కనిపిస్తారు. ఆయనకు ఏ విధమైన చెడు అలవాట్లు లేవు. ఈ విషయాన్ని సీఎం జగన్ ఎన్నోసార్లు వెల్లడించారు. ఒక నాయకుడు ఎలా ఉంటే, మిగతా వాళ్లు కూడా అదే ఫాలో అవుతారని నమ్ముతారు.

Video Advertisement

ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే సీఎం జగన్‌, తన పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా స్పందించరు. అందువల్ల  చాలామందికి ఆయన డైట్‌, మరియు ఫిట్‌నెస్‌ గురించి ఎలాంటి విషయాలు తెలియవు. సీఎం జగన్ అసలు ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటారనే విషయం గురించి మినిస్టర్ రోజా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
సీఎం జగన్ ఆరోగ్యంగా ఉండేందుకే మొదటి నుండి ప్రాధాన్య‌త‌నిస్తారు. దానికి త‌గ్గ‌ట్లుగా ఆహారం తీసుకుంటారు. ఆయనకి మామిడికాయ తురుముతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఉదయం 4.30కి సీఎం జగన్ రోజు మొదవుతుంది. ఉదయం 4.30 గంటల నుండి గంట సేపు యోగా, జిమ్ లాంటివి చేస్తారు. 5.30కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాల గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తీసుకుంటారు. 7 గంటలకు జూస్ తాగుతారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా డ్రైఫ్రూట్స్  తింటారు. ఇక పాదయాత్ర చేసేనపుడు కూడా జగన్ బ్రేక్ ఫాస్ట్ కి దూరంగానే ఉన్నారు. సమీక్షలు చేసే టైమ్ లో చాక్లెట్ బైట్స్ తింటారట. మధ్యాహ్నం భోజనంలో అన్నం కన్నా పుల్కాలను తినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాత్రం రాగిముద్ద, మటన్ కీమాను తింటారు. ఇక కుండపెరుగు లేకుండా మధ్యాహ్నం భోజనం ముగించరని  చెప్తుంటారు. చిత్రాన్నం అంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. ఆయనకు పల్లీలు, మొక్కజొన్న పొత్తులన్నా  ఇష్టం. వీలైనపుడల్లా వీటిని తింటారు.
పళ్ల రసాలకు ప్రాధాన్యమిస్తారు. వారాంతంలో పూర్తిగా ఫ్యామిలితో గడిపే సీఎం జగన్, ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యానీ, మటన్ లాంటి వాటిని ఆరగిస్తారు. ఎన్నిరకాల వంటకాలు  ఇష్టపడినా కూడా జగన్ మితంగానే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. టూరిజం మంత్రి రోజా సీఎం జగన్ తీసుకునే ఎనర్జీ డ్రింక్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లీటరు పాలలో, పచ్చి అల్లం వేసి మరగించి, గ్లాసు పాలు అయ్యే వరకు మరగిస్తారు. అలా కాచిన పాలను రోజు ఆయన తాగుతారని రోజా వెల్లడించారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.

Also Read: చంద్రబాబు నాయుడు ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా..? ఒక రోజులో ఏం తింటారు అంటే..?


End of Article

You may also like