Ads
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలకి పెళ్లి జరిగే నిన్నటితో 26 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా వారిద్దరి పెళ్లి ఫోటోలు అలాగే వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి పెళ్లి రోజు సందర్భంగా ఎంతోమంది ప్రముఖులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వారిద్దరికీ విషెస్ చెప్తూ పోస్ట్ చేశారు.
Video Advertisement
జగన్ మోహన్ రెడ్డికి 24 సంవత్సరాలకి పెళ్లి జరిగింది. కడప జిల్లాలోని పులివెందులలో వైఎస్ఆర్ఆర్ లయోలా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో 1996లో వీరిద్దరి వివాహం జరిగింది. అదే రోజు అదే ముహూర్తానికి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వివాహం కూడా జరిగింది. జగన్ మోహన్ రెడ్డి పెళ్లి జరిగే సమయానికి ఆయన తండ్రి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారు కడపకి ఎంపీగా ఉన్నారు.
జగన్ మోహన్ రెడ్డి రాజకీయవేత్తగా విధులు నిర్వహిస్తూ ఉండగా, భారతి రెడ్డి కూడా పారిశ్రామిక రంగంలో ఉన్నారు. ఎన్నో వ్యాపారాలను భారతి చూసుకుంటున్నారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన భారతి తండ్రి గంగిరెడ్డి పులివెందులలో ఎంతో పేరుపొందిన పీడియాట్రీషియన్. భారతి ప్రముఖ సిమెంట్స్ తయారు చేసే సంస్థ భారతి సిమెంట్స్ కి చైర్మన్ గా ఉన్నారు. అలాగే సాక్షి ఛానల్, పేపర్ కి సంబంధించిన బాధ్యతలను కూడా భారతి నిర్వహిస్తున్నారు. వారిద్దరికీ హర్షా రెడ్డి, వర్షా రెడ్డి అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
వీరిద్దరి పెళ్లి రోజు నాడు పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా అభిమానులను కూడా సోషల్ మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి, భారతి రెడ్డి కి వారి విషెస్ తెలిపారు. గత సంవత్సరం వారిద్దరి 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈ సంవత్సరం కూడా వారి యానివర్సరీ జరుపుకున్నారు. ప్రస్తుతం వారి వెడ్డింగ్ కార్డ్, అలాగే పెళ్లిరోజు ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి.
#
# # # # # #
End of Article