Ads
వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమారుడి పెళ్లి జోధ్ పూర్ లో వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ జోధ్ పూర్ లోని ప్యాలెస్ లో షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం వేడుకలు చేపట్టారు. ఇరువురి కుటుంబ సభ్యులతోపాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒకటయ్యారు. 16వ తేదీన సంగీత్, మెహందీ వేడుక నిర్వహించగా 17న సాయంత్రం ఐదున్నర గంటలకు వివాహం జరిగింది.18వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
Video Advertisement
పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొత్త దంపతులు షర్మిలను హత్తుకున్న ఫోటో పలువురిని ఆకర్షించింది. రాజస్థాన్ లోని వివాహం అనంతరం హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్ చేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాదులోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ కు నిర్ణయించారు. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విందుకు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాతే రాజకీయ కార్యకలాపాలలో షర్మిల పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహ వేడుకకు సీఎం జగన్ దూరంగా ఉన్నారు. అయితే మేనల్లుడి నిశ్చితార్థం వేడుకలకు సతీ సమేతంగా హాజరైన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతూ ఉండటంతో జగన్ బిజీ బిజీగా గడుపుతున్నారు.సిద్ధం పేరిట సభలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన తన మేనల్లుడు వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాజకీయ పరంగా చెల్లెలు తన మీద చేస్తున్న విమర్శలు కూడా ఒక కారణం అంటున్నారు రాజకీయ వర్గాల వారు. అయితే హైదరాబాదులోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో నిర్వహించే రాజారెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ కు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రిసెప్షన్ కు జగన్ హాజరైతే సరే సరి,లేదంటే అన్నాచెల్లెళ్ల మధ్య దూరం మరింత పెరిగిందని అనుకోవాలి.
End of Article