వైయస్ షర్మిలకి కాబోయే కోడలి తల్లిదండ్రులు ఎవరో తెలుసా..? ఆ అమ్మాయి తండ్రి ఏ ఉద్యోగం చేస్తారంటే..?

వైయస్ షర్మిలకి కాబోయే కోడలి తల్లిదండ్రులు ఎవరో తెలుసా..? ఆ అమ్మాయి తండ్రి ఏ ఉద్యోగం చేస్తారంటే..?

by Harika

Ads

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఈ రోజు జరగనున్న సంగతి అందరికి తెలిసిందే. జనవరి 18న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్‌లో రాజారెడ్డి నిశ్చితార్ధం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు షర్మిల సోదరుడు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఆయన సతీమణి భారతి తో కలిసి వచ్చారు.తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకుని మాట్లాడారు. తన మేనల్లుడు రాజారెడ్డికి విషెస్ తెలిపారు. కుటుంబమంతా కలిసి దిగిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Video Advertisement

ఫిబ్రవరి 17 న పెళ్లి జరగనుంది. జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ లో మూడు రోజులపాటు ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. 14 వ తేదీన  సాయంత్రమే షర్మిల కుటుంభం జోధ్ పూర్ ప్యాలెస్ కు చేరుకున్నారు అంట. 16వ తేదీ సంగీత్, మెహందీ కార్యక్రమం.. 17వ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు వివాహం… 18వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు తలంబ్రాలు వేడుక.

ఇది ఇలా ఉండగా…వైయస్ షర్మిల కి కాబోయే కోడలు ప్రియా అట్లూరి ఎవరంటూ పలువురు ఆరాల తీయడం మొదలుపెట్టారు. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ చర్చిస్తున్నారు.వైఎస్ షర్మిల కాబోయే కోడలు ప్రియ బ్యాక్ గ్రౌండ్ గురించి రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. మొదట అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు అని ప్రచారం జరిగింది. అయితే ఆమె అట్లూరి ప్రసాద్‌ మనవరాలు కాదని తెలిసింది. తాజాగా అట్లూరి ప్రియకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె బ్రదర్ అనిల్ స్నేహితుడైన అట్లూరి శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమార్తె అని తేలింది. అమెరికాలో సెటిల్ అయిన అట్లూరి శ్రీనివాస్ అక్కడ బ్రదర్ అనిల్‌కు సంబంధించిన కార్యక్రమాలను కూడా ఆయనే చూసుకుంటారని తెలుస్తుంది. ఈక్రమంలోనే ఇరు కుటుంబల మధ్య రాకపోకలు ఉండటంతో రాజారెడ్డి – ప్రియ మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వచ్చింది అని అంటున్నారు.ఇదిలా ఉంటే అట్లూరి ప్రియ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. జగన్‌ను శత్రువుగా భావించే సామాజికవర్గం నుంచి షర్మిల కొడలును తెచ్చుకోవడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అట్లూరి ప్రియ చంద్రబాబు బంధువు అవుతారని అని కొందరు కామెంట్ చేస్తుంటే,మరి కొందరు షర్మిల జగన్‌ను కాదని బయటకు వెళ్లినప్పుడే ఆమెతో సంబంధం తెగిపోయిందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అట్లూరి ప్రియకు చంద్రబాబుకు మధ్య ఎటువంటి బంధుత్వం లేదని తెలుస్తుంది. సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.


End of Article

You may also like