వైయస్ షర్మిల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా..? భోజనంలో ఇవి తప్పకుండా ఉండాల్సిందే..!

వైయస్ షర్మిల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా..? భోజనంలో ఇవి తప్పకుండా ఉండాల్సిందే..!

by Mounika Singaluri

Ads

వైయస్ షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అధికార పక్షంలో ఉన్న తన అన్న జగన్మోహన్ రెడ్డిని షర్మిల టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.

Video Advertisement

ఒకపక్క రాజకీయంగా టార్గెట్ చేస్తూనే మరోపక్క వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తనను వాడుకుని అవసరం తీరాక గెంటేసారని, తనకు రావాల్సిన ఆస్తిని సైతం ఇవ్వకుండా అడ్డుకున్నాడని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒకపక్క ప్రతిపక్షాలను కూడా షర్మిల ఆటాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని దానిపై తాను పోరాడతానని కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తి మద్దతిస్తుందని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉండే షర్మిల ఒకపక్క ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహిస్తారు. ప్రతిరోజు వ్యాయామంతో పాటు జిమ్ లో కొద్దిసేపు గడుపుతారట. మానసిక ప్రశాంతత కోసం యోగ కూడా క్రమం తప్పకుండా చేస్తారట.

ys-sharmila-fires-on-cm-kcr

ఇంతే కాకుండా తనకి ఫిట్నెస్ పైన ప్రత్యేక దృష్టి ఉందని పలుమార్లు షర్మిల చెప్పారు. అయితే ఆహార విషయాల్లో కూడా షర్మిల ఒక నియమాన్ని పాటిస్తారట ప్రతిరోజు తన భోజనంలో మూడు పదార్థాలు ఖచ్చితంగా ఉండాల్సిందేనట. ఉదయం పూట అల్పాహారంగా రెండు ఇడ్లీలు లేదా దోస తో పాటు పల్లి చట్నీ కంపల్సరిగా తీసుకుంటారట. ఇక మధ్యాహ్నం భోజనం విషయానికొస్తే ఏదో ఒక నాన్ వెజ్ కూర వండాల్సిందేనట.

అలాగే సాయంత్రం సమయంలో ఒక ఫ్రూట్ జ్యూస్,రాత్రి భోజనానికి చపాతి తోపాటు పెరుగన్నం తీసుకుంటారట. ఇక నాన్ వెజ్ కూరల విషయంలో షర్మిలాకి నాటుకోడి కూర అంటే చాలా ఇష్టం అంట. ఇక పోషకాహార పదార్థాలు ఉన్న చేపలను కూడా ఇష్టంగా తింటారట. షర్మిల ఆరోగ్యం పట్ల ఇంత జాగ్రత్త తీసుకుంటారు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో మూడు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసిన ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


End of Article

You may also like