Ads
సాధారణంగా కొంత మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఒక విషయం పదే పదే జరుగుతూ ఉంటే దాన్ని సెంటిమెంట్ అని అంటారు. ఎంతో మంది ప్రముఖులకు కూడా ఇలా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి.
Video Advertisement
కొన్ని సెంటిమెంట్స్ వాళ్ళకి ఉంటే, కొన్ని సెంటిమెంట్స్ మాత్రం చూస్తున్న ప్రజలకే తెలిసాయి. సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఇలాంటి సెంటిమెంట్స్ ఉండడం సహజమే.
వారి సినిమాలు విడుదల అవుతున్నప్పుడు ప్రేక్షకులు కూడా వారి పాత సినిమాల గ్రాఫ్ పరిశీలించి, చూసి అక్కడ ఏదైనా సెంటిమెంట్ ఉంటే అది కనిపెట్టి, ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు ఈ సినిమా ఫలితం ఇలా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే, రాజకీయ ప్రముఖులకు కూడా ఇలాంటి ఒక సెంటిమెంట్ ఉంది. వైయస్ షర్మిల సెంటిమెంట్ ప్రకారం నెక్స్ట్ జరగబోయేది ఇదే అంటూ కొంత మంది కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
వివరాల్లోకి వెళితే, వైయస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గతంలో వైయస్ షర్మిల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది. అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుండి కనుమరుగు అయిపోయింది. అప్పుడు షర్మిల తన అన్న కోసం కాంగ్రెస్ పార్టీ మీద పోరాడారు. అప్పుడు ఈ ప్రభావం అధికార పార్టీ మీద తీవ్రంగా పడింది. కాంగ్రెస్ ఓడిపోవడం ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం గెలవడం జరిగాయి.
అయితే, ఇప్పుడు వస్తున్న సెంటిమెంట్ ఏంటి అంటే షర్మిల రాజకీయంలో ముందు అడుగు వేసిన ప్రతిసారి అధికారిక పార్టీ మీద అది ప్రభావం చూపుతుంది. ప్రతిపక్ష పార్టీకి మాత్రం అది వరం అవుతుంది. 2019 లో జరిగిన మరొక సంఘటన కూడా దీనికి నిదర్శనంగా నిలిచింది. ఈ సెంటిమెంట్ కారణంగా తెలుగుదేశం ఓడిపోవడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయం మొదలు పెట్టారు షర్మిల. ఈ సెంటిమెంట్ కి ఉదాహరణగా ఇంకొక విషయం కూడా జరిగింది. అధికారం పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది.
తను గెలవకపోయినా కూడా, అధికారిక పార్టీ అయిన బీఆర్ఎస్ ని గద్దె దించారు. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ గెలిచింది. అయితే, ఇప్పుడు ఈ సెంటిమెంట్ కానీ రిపీట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ గెలవడం జరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల పరిశీలన మాత్రం ఇదే. మరి ఇందులో సెంటిమెంట్ అనేది ఎంత వరకు నిజం, అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది తెలియాలి అంటే 2024 ఎలక్షన్స్ ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.
ALSO READ : ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం లేదు.. వైరల్ అవుతున్న నయనతార క్షమాపణ లేఖ!
End of Article