YS SHARMILA SON ENGAGEMENT: నిశ్చితార్థమే ఈ రేంజ్ లో ఉంటే…ఇంక పెళ్లి ఏ రేంజ్ లో ఉంటుందో.? షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ లో హైలైట్ ఇదే.!

YS SHARMILA SON ENGAGEMENT: నిశ్చితార్థమే ఈ రేంజ్ లో ఉంటే…ఇంక పెళ్లి ఏ రేంజ్ లో ఉంటుందో.? షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ లో హైలైట్ ఇదే.!

by Harika

Ads

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. . జనవరి 18న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్‌లో రాజారెడ్డి నిశ్చితార్ధం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు షర్మిల సోదరుడు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఆయన సతీమణి భారతి తో కలిసి వచ్చారు.తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకుని మాట్లాడారు. తన మేనల్లుడు రాజారెడ్డికి విషెస్ తెలిపారు. కుటుంబమంతా కలిసి దిగిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వేడుక ఫోటోలు ఓ లుక్ వేయండి.

Video Advertisement

సీఎం జగన్ తో సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు విచ్చేశారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంకా మరికొంతమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇది ఇలా ఉంటే…రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో ఇదే హైలైట్ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే…ఈ వేడుకలో దాదాపు 150 రకాలకు పైగా వంటకాలు పెట్టారంట. తెలుగు రాష్ట్రాల స్పెషల్ వంటకాలే కాకుండా విదేశీ అతిథులకు స్పెషల్ డిషెస్ కూడా చేయించారట. ఎంగేజ్మెంట్ లోనే ఇన్ని రకాలు పెట్టారంటే… ఇక పెళ్ళిలో విందు ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ నెట్ ఇంట టాక్ నడుస్తుంది.


End of Article

You may also like