కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. మన దేశంలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాదు ఢిల్లీలో మరో వ్యక్తికి కూడా కరోనావైరస్ వచ్చిందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. ప్రస్తుతం వారిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స కొనసాగిస్తున్నారు.

Video Advertisement

సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ యువకుడికి కరోనా వైరస్ సోకింది అనే వార్త నిన్న వచ్చింది. అతను దుబాయ్ వెళ్లిన సమయంలో ఈ వైరస్ సోకినట్టుగా భావిస్తున్నారు. తెలంగాణకు చెందిన 24 ఏళ్ల యువకుడు బెంగళూరు నుంచి ఫిబ్రవరి 17వ తేదీ దుబై వెళ్లాడు. దుబాయ్ లో హొంగ్ కాంగ్ కి చెందిన వ్యాపారవేత్తలతో అతను మీట్ అయ్యాడు. ఆ సమయంలోనే కరోనా వైరస్ అతని శరీరం లోకి ప్రవేశించి ఉంటుంది అంటున్నారు వైద్యులు.ఆ తర్వాత దుబాయ్ నుండి బెంగళూరు వచ్చారు. అక్కడ మూడు రోజులు ఆఫీస్ కి వెళ్ళాడు. బెంగళూరు లో అతని ఫ్రెండ్ తో రూమ్ లో ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీ బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. అనంతరం జ్వరం రావడంతో సికింద్రాబాద్‌లోని అపోలోను సంప్రదించాడు. కానీ అక్కడ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు వైద్యులు.

అక్కడ పరీక్షలు నిర్వహించడంతో వైరస్ ఉన్నట్లు తేలింది. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపిల్ ను పూణే లోని ల్యాబ్ కి మంచి పంపించారు. పాజిటివ్ రావడంతో ఐసొలేషన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆ యువకుడు గాంధీ ఆస్పత్రిలోని ఏడో అంతస్తులోని కరోనా వార్డులో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరు లోని అతని రూమ్ మేట్ కూడా బెంగుళూరు లోని హాస్పిటల్ లో చేరారు.

ఇంకా హైదరాబాద్ టెక్కీతో పాటు కాంటాక్టులో వున్న దాదాపు 80మందిని గుర్తించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ 80మందిలో కుటుంబ సభ్యులు, బస్సు ప్రయాణీకులు వున్నారు. హైదరాబాదు బస్సులో ప్రయాణించడమే కాకుండా. బెంగళూరులోని అతని కార్యాలయంలో మూడు రోజుల పాటు ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో అతని ఆఫీస్ వాళ్ళకి కూడా టెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ టెక్కీ ఆరోగ్యం కుదుటగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాబట్టి మనం భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.