ఆన్లైన్ క్లాస్ వల్ల గొడవతో ప్రాణాలు తీసుకున్న యువతి…మిస్టరీగా ఆమె చితిలో సజీవదహనమైన యువకుడు.!

ఆన్లైన్ క్లాస్ వల్ల గొడవతో ప్రాణాలు తీసుకున్న యువతి…మిస్టరీగా ఆమె చితిలో సజీవదహనమైన యువకుడు.!

by Mohana Priya

Ads

ఆన్లైన్ క్లాసెస్ నేపథ్యంలో ఒక కుటుంబంలో చోటు చేసుకున్న ఘర్షణ ఒక యువతి ఆత్మహత్య కు దారి తీసింది. సాక్షి కథనం ప్రకారం ఆర్ముగం అనే రైతు కుమార్తె నిత్య శ్రీ కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్ ‌పేట సమీపం మేట్టునన్నావరం గ్రామానికి చెందిన ఒక నర్సింగ్ విద్యార్థిని. నిత్య శ్రీ కి ఇద్దరు సోదరిలు ఉన్నారు. వారు ముగ్గురు ఒకటే ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కి హాజరవుతారు.

Video Advertisement

ఒకసారి ఈ విషయం మీద ముగ్గురికి గొడవైంది. ఆర్ముగం వాళ్లని మందలించారు. ఈ సంఘటన వల్ల మనస్తాపానికి గురైన నిత్యశ్రీ ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం చివరి శ్వాస విడిచారు. అదే రోజు ఆ గ్రామంలో ఉన్న ఒక స్మశాన వాటికలో నిత్యశ్రీ మృతదేహాన్ని దహనం చేశారు.

ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో నిత్యశ్రీ మృతదేహం దహనం అవుతున్నప్పుడు, ఒక మగ గొంతు ఆక్రందనలు వినిపించాయట. స్మశాన వాటిక సిబ్బంది గ్రామ ప్రజలకు ఈ విషయాన్ని చెప్పారు. మేడాత్తనూరు గ్రామంలో నివసించే మురుగన్ అనే వ్యక్తి గత నెల 31వ తేదీ నుండి తన కొడుకు రాము కనిపించడం లేదు అని 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారట.

నిత్యశ్రీ మృతదేహం దహనం అవుతున్నప్పుడు రాము అక్కడ సంచరించడం చూశామని రాము స్నేహితులు పోలీసులకు చెప్పారు. నిత్యశ్రీ తో పాటు తన కొడుకు కూడా దహనం అయ్యారేమో అని మురుగన్ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు, జిల్లా ఫోరెన్సిక్ నిపుణులు బుధవారం సాయంత్రం స్మశాన వాటిక కు వెళ్లి నిత్యశ్రీని దహనం చేసిన చోటు పరిశీలించారు. అక్కడ వాళ్ళకి ఒక వాచ్ తో పాటు సెల్ ఫోన్ భాగాలు దొరికాయి.

ఫోరెన్సిక్ నిపుణులు ఎముకలను పరిశీలించడానికి తీసుకువెళ్లారు. ఉళుందూర్‌ పేట డీఎస్పీ విజయకుమార్‌ మాట్లాడుతూ నిత్య శ్రీ మృతదేహం దహనం అవుతున్న మంటల్లో ఒక యువకుడు కూడా దహనమైనట్లు తెలుస్తోంది అని, అదే రోజున రాము కూడా కనిపించకుండా పోవడం, స్మశాన వాటిక పరిసరాల్లో సంచరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది అని, ఫోరెన్సిక్ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే నిత్యశ్రీ మృతదేహం దహనం అవుతున్న మంటల్లో దహనమైన వ్యక్తి రాము నా కాదా అనే విషయాన్ని నిర్ధారించగలం అని అన్నారు.


End of Article

You may also like