Home News “నోట్లో గులాబ్ జామ్ పెట్టుకొని?” అంటూ యువరాజ్ ట్రోల్…రోహిత్ భార్య క్రేజీ కౌంటర్.!

“నోట్లో గులాబ్ జామ్ పెట్టుకొని?” అంటూ యువరాజ్ ట్రోల్…రోహిత్ భార్య క్రేజీ కౌంటర్.!

by Megha Varna

Ads

భారతదేశ క్రికెట్ జట్టు క్రీడాకారుడు రోహిత్ శర్మ కి ఇటీవల రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత రాజీవ్ ఖేల్ రత్న అందుకోబోతున్న నాలుగవ క్రికెటర్ గా రోహిత్ శర్మ ఘనతను సాధించారు. మరొక క్రికెటర్ ఇషాంత్ శర్మ కి, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ కి అర్జున అవార్డును ప్రకటించారు.

Video Advertisement

https://www.instagram.com/p/CEMIrdchu-a/

తనకి అంత పెద్ద గౌరవం దక్కిన సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ రోహిత్ శర్మ సోషల్ మీడియా లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో కి మరొక భారత జట్టు క్రికెటర్ యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ పై సరదాగా కామెంట్ చేస్తూ రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై లో రోహిత్ శర్మ భార్య రితిక ని ట్యాగ్ చేశారు యువరాజ్ సింగ్.

“నోట్లో గులాబ్ జామ్ పెట్టుకొని కూడా బాగా మాట్లాడగలుగుతున్నావు?” అని వీడియో లో ముఖం కొంచెం లావుగా కనిపిస్తున్న రోహిత్ శర్మ పై యువరాజ్ సింగ్ కామెంట్ చేశారు. దీనికి రోహిత్ శర్మ భార్య రితిక ” ఒక ఖేల్ రత్న ని వెక్కిరిస్తున్నావు” అని అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చారు.

ఇదంతా వాళ్ళు సరదాగానే మాట్లాడుకోవడం తో ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ సెప్టెంబర్ లో మొదలవ్వనున్న ఐపీఎల్ 2020 కి సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నారు. యూఏఈ లో జరగబోతున్న ఐపీఎల్  2020 లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం తరపున ఆడబోతున్నారు.


End of Article

You may also like