Home Biography “జాంబి రెడ్డి” హీరోయిన్ తెలుగింటి అమ్మాయి అని మీకు తెలుసా.? ఆమె గురించి ఆసక్తికర విషయాలివే.!

“జాంబి రెడ్డి” హీరోయిన్ తెలుగింటి అమ్మాయి అని మీకు తెలుసా.? ఆమె గురించి ఆసక్తికర విషయాలివే.!

by Mohana Priya

ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ హీరోగా నటించిన సినిమా జాంబి రెడ్డి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 5వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇందులో ఒక హీరోయిన్ గా దక్ష నాగర్కర్ నటించగా, ఆనంది మరొక హీరోయిన్ గా నటించారు. ఆనంది మన తెలుగమ్మాయి.

zombie reddy fame anandhi

వరంగల్ కి చెందిన ఆనంది ఆట ప్రోగ్రాం లో కూడా పాల్గొన్నారు. ఆనంది అసలు పేరు రక్షిత. 2012 లో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో మొదటిసారిగా బిగ్ స్క్రీన్ పై కనిపించారు. తర్వాత అదే సంవత్సరంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాలో నటించారు. ఆ తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో, వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.

నాయక్ సినిమాలో బ్రహ్మానందం గారు పెళ్లి చూపులు చూడడానికి వెళ్లే అమ్మాయిగా, రఘు బాబు చెల్లెలిగా నటించారు ఆనంది. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ అనే సినిమాలో కనిపించారు. తర్వాత 2014 నుంచి వరుసగా ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు. వాటిలో కయల్, త్రిష ఇల్లనా నయనతార, విసారణై, పరియేరుమ్ పెరుమాళ్ సినిమాలు ఆనందికి ఎంతో పేరు తెచ్చాయి.

zombie reddy fame anandhi

మళ్లీ దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత జాంబి రెడ్డి తో డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించారు ఆనంది. అలాగే సుధీర్ బాబు హీరోగా రాబోతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. జనవరి 7వ తేదీ 2021 లో వరంగల్ లో సోక్రటీస్ తో ఆనంది వివాహం జరిగింది.

zombie reddy fame anandhi

zombie reddy fame anandhi

zombie reddy fame anandhi

zombie reddy fame anandhi

zombie reddy fame anandhi

You may also like