Ads
సైంటిఫక్ రీసెర్చ్ లో భాగంగా ఈనెల 10 నుంరి 30వ తేదీ మధ్య ఆకాశంలోకి వదిలే బెలూన్‌లు భూమిమీద పడిపోయి కనిపిస్తే వాటిని ఎవరూ తాక వద్దని, దాని సమాచారాన్ని సమీపంలోని పోలీస్‌స్టేషన్ లేదా దాని పై ఉన్నఫోన్ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆటోమిక్ ఎనర్జీ, ఇస్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెలూన్‌లు లో హైడ్రోజన్ వాయువును నింపుతారు. వాటితో పాటు పరిశోధనలకు అవసరమైన పరికరాలు ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Video Advertisement
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అధికారులు, ఇస్రో ఆధ్వర్యంలో సైంటిఫిక్ పరిశోధనల నిమిత్తం 10 బెలూన్ ఆకాశంలోకి వదలనున్నారు. మొదటి బెలూన్‌ను ఈనెల వారంలో ఆకాశంలోకి వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. ఇవి సాధారణంగా రాత్రి సమయంలో ప్రారంభిస్తారు. భూమి నుంచి 30 నుంచి 42 కి.మీ. ఎత్తులో వీటిని పరిశోధనల నిమిత్తం నింగిలోకి వదిలారు.
ఒక్కోబెలూన్‌లో అమర్చిన సైంటిఫిక్ పరికరాలు 10గంటల పరిశోధనల తర్వాత భూమిపైకి దిగుతాయి. రంగురంగుల ప్యారాచూట్‌లలో ఇవి కింది దిగే అవకాశం వుంది. ఈ బెలూన్‌లు హైదరాబాద్ నగరానికి 200 నుంచి 350కి.మీ. దూరంలో భూమి పైకి చేరుకుంటాయి. సోలాపూర్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఇవి కిందికి దిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కుమ్రం భీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, కరీంనగర్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, వరంగల్, యదాద్రి జల్లాల్లో ఈ బెలూన్‌లు భూమిపైకి చేరే అవకాశం ఉంది
ఇవి ఎవరికైనా కనిపిస్తే వాటిని తాకవద్దని అందులోని కొన్ని పరికరాల్లో హై వొల్టేజ్ విద్యుత్ ప్రవహిస్తుందన్నారు. చాలా సున్నితమైన, విలువైన సైంటిఫిక్ డేటా అందులో ఉంటుందని, ఎవరైనా దానిని తెరిస్తే డేటా చెదిరిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేయాలని, దానికి ఎలాంటి పారితోషికం ఉండదని ప్రకటనలో పేర్కొన్నారు. అందరికి షేర్ చేయండి
End of Article