జననం లోనే కాదు ఈ ట్విన్ బ్రదర్స్ మరణం లో కూడా ఒకే సారి.. వీరి కథ వింటే కన్నీళ్లే..!

జననం లోనే కాదు ఈ ట్విన్ బ్రదర్స్ మరణం లో కూడా ఒకే సారి.. వీరి కథ వింటే కన్నీళ్లే..!

by Anudeep

Ads

కవలలు పుట్టినప్పుడు చాలా సంబరపడుతుంటాం. వారిద్దరూ ఏ పని చేసినా కలిసే చేస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కలిసిమెలసి, ఒకేలా కలిసిపోతారని సంతోషిస్తాం. ఆ కవలల తల్లితండ్రులు కూడా అలానే అనుకున్నారు. కానీ, చావు లో కూడా ఒకేరోజు ఈ లోకాన్ని వీడతారని ఊహించలేదు. మీరట్ కు చెందిన ఈ ఇద్దరు కవలలు మూడు నిమిషాల తేడాతో జన్మించారు. జోయీఫ్రెడ్ , రాల్ ప్రెడ్ ..వీరి పేర్లు. కరోనా కారణం గా జోయీఫ్రెడ్ కన్నుమూశారు. అతను మరణించిన గంట వ్యవధిలోనే సోదరుడు రాల్ ప్రెడ్ కూడా మరణించారు.

Video Advertisement

merut twins

వీరి మరణం ఆ తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వీరి వయసు 24 సంవత్సరాలు. ఒకేరోజు ఈ లోకాన్ని చూసి, ఒకేరోజు ఈ లోకాన్ని వీడారు. వీరి మరణం స్థానికం గా విషాదాన్ని మిగిల్చింది. ఏప్రిల్ 23 న వీరికి జ్వరం వచ్చింది. క్రమం గా వీరి పరిస్థితి ఇబ్బందికరం గా మారుతూ మే 1 కి వీరి కండిషన్ సీరియస్ అయింది. ఇద్దరినీ వెంటిలేటర్ పై సపోర్ట్ కి ఉంచారు. మే 10 వ తేదికి వీరిద్దరికి నెగటివ్ రావడం తో ఊపిరి పీల్చుకున్నారు. కానీ మూడు రోజుల తరువాత వీరు మరణించడం అందరిని విషాదం లోకి నెట్టింది.


End of Article

You may also like